బెంగళూరు(Bangalore)లోని భారత ప్రభుత్వ రక్షణ(Indian Govt) మంత్రిత్వశాఖ(Ministry of Defense)కు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL)..

ఒప్పంద ప్రాతిపదికన(Contractual Basis) ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన(Qualified) అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు(Applications) ఆహ్వానిస్తోంది .

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 10 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌(10 PE) పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష(Written Exam), ఇంటర్వ్యూ ఆధారంగా(Interview Based) అభ్యర్ధులను సెలెక్ట్ చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 28(June 28) వరకు ఆన్‌లైన్‌(Online)లో అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bel-india.in/  అధికారిక వెబ్‌సైట్‌(Official Website) చూడొచ్చు.

ముఖ్య సమాచారం

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌Related Specialization)లో బీటెక్‌(B.TECH)/బీఈ(BE) లో కనీసం 55 శాతం మార్కుతో ఉత్తీర్ణత (Pass)సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం(2years Experience) కూడా ఉండాలి.

పే స్కేల్‌:

మొదటి ఏడాది నెలకు రూ.40,000

రెండో ఏడాది నెలకు రూ.45,000

మూడో ఏడాది నెలకు రూ.50,000

నాలుగో ఏడాది నెలకు రూ.55,000ల వరకు జీతం(Salary)గా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు(Age) 32 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌(Offline) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిప్యూటీ మేనేజర్‌, బెల్‌, జలహళ్లి, బెంగళూరు-560013.

దరఖాస్తు రుసుము: రూ.400

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 28, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.bel-india.in/