బిగ్  బాస్ సీజన్ 5(Big Boss Season 5) ఈ వారం వీకెండ్ షో ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వచ్చేసింది. హౌస్ లో ఎప్పుడు గొడవలు, రచ్చలతో సాగిపోయేది, కానీ ఈ వారం హౌస్ లో ఓ చిన్నపాటి లవ్ స్టోరీలతో నడిపించేసారు కంటెస్టెంట్స్(Contestants).

ఒక్క పక్క షన్ను- సిరి గిల్లీకజ్జాలు, మరో పక్క పింకీ – మానస్ బుజ్జగింపులతో రొమాంటిక్ సీన్స్ ని పండించేస్తున్నారు. ఇక హౌస్ మేట్స్(House mates) అయితే ఈ రెండు జంటలను చూసి తలపట్టుకుంటున్నారు. చూసే ప్రేక్షకులు కూడా ఆయ్యోమయ్యంలో వుంటున్నారు.

ఈ వారం కెప్టెన్ అయిన యానీ ఎంతవరకు కెప్టెన్(Captain) గా సక్సెస్ కాన్నుదో.

శనివారం నాగ్ సర్ వచ్చారంటేనే మస్తీ టైం మరి హోస్ మేట్స్ తో కలసి నాగ్ సర్ ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్(Entertainment) చేసారో శనివారం ఎపిసోడ్ పై ఓ లుక్ వేద్దామా….

ఎన్టీఆర్ పాట తో ఎంట్రీ ఇచ్చిన నాగ్ సర్ శుక్రవారం నాటి ఎపిసోడ్ ని చూపించారు. సిరి, షన్ను లా గిల్లికజ్జాలు తోను, మానస్- పింకీ ల మధ్య రొమాన్స్ తో బోర్ కొట్టేలా వున్నా వాళ్ళ పెర్ఫార్మన్స్లు. ప్రతిదానికి సిరి అలగడం, షన్ను ఎంత బతిమిలాడిన పట్టించుకోకపోవడం. చీటికిమాటికి ఏడ్చి మానస్ ని ఇర్రిటేట్ చేయడం చుసిన ప్రేక్షకులు మాకెంటిది అంటూ తలపట్టుకుని వుంటారు. అయితే కెప్టెన్సీ టాస్క్(captaincy task) లో మాత్రం ఎవరికీ వారు తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. నాగ్ సర్ కంటెస్టెంట్స్(Contestants) తో మాట్లాడడం మొదలు పెట్టడం తో అసలు వీకెండ్ షో మొదలైంది. ముందు గా ఈ వారం కెప్టెన్ అయిన యానీ కి కంగ్రాట్స్(Congrats) చెప్పారు. షణ్ముక్‌ని కూడా మెచ్చుకున్నారు. సంచాలక్‌గా ఫ్రెండ్స్ అని చూడకుండా బాగా ఆడావు, అందరినీ సమానంగా చూసావు అంటూ పొగిడారు నాగార్జున.

తరువాత ఎప్పుడు రవి ని టార్గెట్ చేసి మాట్లాడే నాగ్ ఈ సారి రవిని మెచ్చుకున్నారు. కెప్టెన్సీ(Captency) టాస్క్ లో రవిని టార్గెట్(Target) చేసి మరి ఎంత ఇబ్బంది పెట్టిన టాస్క్ పూర్తి చేసాడే తప్ప క్విట్ అవ్వలేదు. ఇంటి సభ్యులకు ఒక్కొక్కరిగా రివేంజ్ తీర్చుకునే అవకాశం కల్పించారు హోస్ట్ నాగార్జున. మొదటిగా రవి గుడ్డు, సోయాసాస్, చిల్లీ సాస్ ఇలా అన్నీ కలిపి షణ్ముక్‌తో తాగించి రీవేంజ్ తీర్చుకునేట్టు చేశారు. తర్వాత ఆనీ కాజల్ చేత, ప్రియాంక రవి చేత తాగించారు. శ్రీరామ్ సన్నీపై అలాంటి రివేంజ్ తీర్చుకుంటాడు.

ఇక నామినేషన్(Nomination) లో ఉన్న వారిలో మొదటగా రవిని సేవ్(Save) చేశారు. ఆ తరువాత హీరో వర్సెస్ విలన్ అనే గేమ్ ఆడించారు నాగ్. తమకు హీరో ఎవరో బ్యాడ్జ్(Hero badge) పెట్టాలి. విలన్ ఎవరో క్రాస్ స్టాంప్(Cross stamp) చేసి చెప్పాలి అంటూ నాగార్జున అనగానే. సిరి ‘అయ్యో మేకప్ సార్’ అంటుంది. దాంతో నాగార్జున ‘ఎవరైనా సిరికి స్టాంప్ వెయ్యాలి అనుకుంటే ముఖంపైనే వేయండి’ అంటూ సెటైర్ వేసాడు.‘రా సిరి నువ్వే స్టార్ట్ చెయ్యి’ అనడంతో సిరి మొదట హీరో అంటూ షణ్ముఖ్‌కి బ్యాడ్జ్ పెట్టి హగ్ ఇస్తుంది.‘దీనికి హగ్ ఏంట్రా’ అంటూనే హగ్ తీసుకుంటాడు షణ్ముఖ్.‘ఈ ఎమోషన్స్(Emotions) ఏంటో నాకేం అర్థం కావు’ అంటూ నాగార్జున కూడా సెటైర్ వేస్తారు. ఇక విలన్ అంటూ ప్రియాంకకి స్టాంప్ వేస్తుంది సిరి.

ఇక ప్రియాంక సిరిని విలన్‌(Vilan)గా స్టాంప్ వేస్తుంది. ‘హీరో అయితే మానస్ సార్’ అంటూ బ్యాడ్జ్ తగిలిస్తుంది. శ్రీరామ్ విశ్వాకు హీరో అంటూనే విలన్‌గా సిరికి స్టాంప్ వేస్తాడు. కాజల్ ఆనీని విలన్ అంటూ ‘ఆమె నన్ను విలన్‌గా చూస్తున్నారు కనీసం కూర్చుని మాట్లాడుకుని సార్ట్ అవుట్  చేసుకుందాం అన్న ఛాన్స్  ఇవ్వట్లేదు అందుకే విలన్’ అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు హీరోగా మానస్‌కి  హీరో బ్యాడ్జ్ ఇచ్చింది . సన్నీ జెస్సీకి హీరోగా బ్యాడ్జ్ ఇచ్చాడు. ప్రియాంక సరిగా ఆడటం లేదు అని విలన్ స్టాంప్ వేస్తాడు.

తరువాత  నామినేషన్‌(nomination)లో ఉన్నవారందరినీ నిలబెట్టి.. సిరిని సేఫ్ చేస్తారు నాగార్జున. రవి విశ్వని హీరోగా చెప్పి బ్యాడ్జ్ పెడతాడు.‘మొదటి నుంచి ఇప్పటి దాకా నమ్మకం విషయంలో కానీ, ఇంట్లో ఏ పనిచెయ్యాలన్న విశ్వ అన్న పర్ఫెక్ట్ గా చేస్తాడు. తనే హీరో’ అని చెప్పాడు. విలన్‌గా షణ్ముఖ్‌ని సెలెక్ట్ చేస్తాడు. షణ్ముఖ్ విలన్‌గా రవికి స్టాంప్ వేస్తాడు. కారణం తన కారణంగా మూడోవారంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని, అందుకే తనకు దూరంగా ఉంటున్నాను. నాకు ఎప్పటికీ తనే విలన్ తను విలన్ అయితే నేను హీరోని అవుతాను అంటూ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత సిరి హీరోని చేస్తూ ‘అబ్బాయిలకంటే బీభత్సంగా ఆడుతుంది’ అంటూ పొగిడాడు. వీకెండ్ వచ్చే సరికి ఒక్కరిని ఒక్కరు పొగుడుకుంటారు. వీకంతా కొట్టుకుంటూ, ఒక్కరి మీద ఒక్కరు అలుగుతూ వుంటారు. ఏంటో విల్లా ఫ్రెండ్షిప్ లేదంటే గేమ్ స్ట్రాటజీ(Game Strategy) ఏమో? చూస్తున్న ప్రేక్షకులకే తెలియాలి మరి. మొత్తానికి ఈ గేమ్ లో హీరో(Hero)గా విశ్వ, విలాన్(Vilan) గా పింకీ నిలిచారు.

ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఒక్కరు ఎలిమినేట్(eliminate)  అవ్వాల్సి వుంది.అయితే హీరో గా నిలిచిన విశ్వ ఎలిమినేట్ అవ్వనున్నాడని తెలుస్తోంది.