మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం(Good Food) తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం సరిగా లేకుంటే అన్ని వున్నా వ్యర్థమే కదా.అందుకే ఆరోగ్యంగా ఉండమని నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఆలా ఉండాలంటే ఆకురాలు ఎక్కువగా తినాలి. అందులో పాలకూర ప్రత్యేకమైనది, వారానికి ఒక్కసారి పాలకూరను తింటే పేద రోగాలను సైతం తరిమికొట్టవచ్చని అంటున్నారు వైద్యులు. అసలు పాలకూరతో కలిగే ప్రయోజనాలు(Benefits) ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం నిత్యం తినే అనేక ఆకు కూరల్లో పాలకూర ఒకటి. పాలకూర(Spinach) పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది.దీనిని మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల చల్ల ఆరోగ్య ప్రాయోజనాలను పొందవచ్చు.

పాలకూర లో వుండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే వయసు మీద పడ్డం వలన వచ్చే శుక్లాలు, ఇతర కంటి సమస్యలను రాకుండా చూస్తుంది. నిత్యం పాలకూర(Spinach) ఆహారం లో భాగం చేసుకోవడం చూసుకుంటే నేత్ర సమస్య(Eye Problems)లు రాకుండా చూసుకోవచ్చు. పాలకూర మెదడుకు(Brain) అవసరమైన చక్కని ఆహారం.

ఇది ఫోలీట్ ఆసిడ్ ఆమ్లం(Folite Acid Amla), విటమిన్ ఏ (Vitamin A), విటమిన్ సి(Vitamin C) వంటి ఖనిజాల(Minerals)తో పాటు అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లను(Yanti Oxidants) కూడా కలిగి వుంది. అంతే కాకుండా ఇది జ్ఞాపకశక్తిని(Memory) మెరుగుపరుస్తుంది. ప్రతి రోజు పాలకూర తినడం వల్ల మీ రోజు వారి పోషకావసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.పాలకూర ఆకులలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ తో నిండి ఉంటుంది. మధుమేహం(Diabetes), మూత్రపిండాల్లో రాళ్లు(Stones in kidney), క్యాన్సర్(Cancer), హార్ట్ స్ట్రోక్(Heart stroke) నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఇది సహాయపడుతుంది.ఇందులో రోగ నిరోధక(Immunity) సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి ఇది శరీరం లో వచ్చే వాపులను నివారించి దానికి చికిత్స(Traetment) చేయడంలో సహాయపడుతుంది.పాలకూరలో విటమిన్ కే పుష్కలంగా లభించడం వల్ల ఎముకలు(Bones) బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.

పాలకూర(Spinach)లో లభించే ఫైబర్(Fiber) కారణంగా జీర్ణక్రియ(Digestion) సులభంగా అవుతుంది. అందుకే మలబద్ధకాన్ని(Constipation) నివారించడంలో పాలకూర కీలక పాత్ర పోషిస్తుంది. పాలకూర లో ప్రోటీన్ లు ఎక్కువగా ఉండడం వలన మీ కడుపు పూర్తిగా నిండిన అనుభూతిని ఎక్కువ సేపు ఉంచుతుంది.పాలకూరలో వుండే విటమిన్ కే రక్తం త్వరగా గడ్డకటేందుకు దోహదపడుతుంది.

మన శరీరం లో విటమిన్ కే(Vitamin K) లేకపోతే గాయాలైనపుడు పెద్ద ఎత్తున రక్తస్రావం అవుతుంది. పాలకూర(Spinach) వంటి ఆకురాల్లో కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. త్వరగా బరువు(Weight loss) తగ్గాలనుకునే వారికి ఇది చాల మంచిది. పాలకూరలో వుండే మెగ్నీషియం(Magnesium),రక్తపీడతను నియంత్రించడానికి సహాయపడుతుంది.

అలాగే ఇందులో వుండే ఫోలీట్(Folite) హృద్రోగ సమస్య(Heart Problem)లు రాకుండా నివారిస్తుంది.శరీరంలో చేదు కొలెస్ట్రాల్ని(Bad Cholestrol) తగ్గిస్తుంది. ఆకుకూరల్లో పోషకవిలువలు గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు ఇదొక్క రూపం లో తాజా ఆకురాలను తినడం అలవాటు చేసుకోవడం మంచిది.

ఆకురాలు అనగానే ఏ పప్పుతోనో, కూరల్లోనో వేసుకుని మాత్రమే తినకూడదు వట్టి ఆకురాలతో రకరకాల  కూరల్ని వండుకుని తినాలి. అప్పుడే మనకు అన్ని రకాల పోషకాలు లభిస్తాయి.