సూర్యుడు తేజోసంపన్నుడు, శక్తవంతుడు, సూర్య రష్మికి గల శక్తి(Power) అపారం. సూర్యరశ్మి(Sunlight) లేకపోతే జీవనమే (Life) లేదు. అంతటి శక్తివంతుడిని కొలుస్తూ నమస్కరించడం వల్ల మనకే ఎక్కువ లాభాలు(Profits) ఉన్నాయని సెలవిస్తున్నారు నిపుణులు.

నిత్యం ఉదయాన్నే సూర్య నమస్కారం (Surya Namskaras)లు చేయడం వల్ల శరీరం తేజోవంతంగా తయారవుతుందని తెలియజేస్తున్నారు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం!

ఉదయాన్నే సూర్యునికి నమస్కరించడం అనేది, ఇప్పటిది కాదు ప్రాచీన కాలం(Ancient Time) నుంచి వుంది. ప్రస్తుత కాలంలో సూర్య నమస్కారాలు చేయడానికి తీరిక(Time), ఓపిక(Patience) లేదు. అయితే ఇప్పుడిప్పుడే సూర్య నమస్కారాలు ప్రాశస్త్యం(Important) గురించి గురించి తెలుసుకుంటున్న వారు తిరిగి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్యం సొంతం చేసుకుంటున్నారు.

సర్వ రోగాల(diseases)కు పరిష్కారంగా సూర్య నమస్కారం ఒకటి చాలు అని చెప్తున్నారంటే వీటిలో ఎంతో గొప్ప శక్తి దాగివుందో అర్ధం చేసుకోవచ్చు. వివిధ ఆరోగ్య సమస్యలకు మరియు చర్మ సమస్యల(Skin Problems)కు సూర్య నమస్కారాలతో చెక్ (Check)పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు(Doctors).

సూర్యోదయం (Sunrise), సూర్యాస్తమయం(Sunset) జరుగుతున్నపుడు, వాతావరణం (Weather)లో ఆక్సిజన్(Oxygen) అధికంగా ఉంటుంది. ఆ సమయాల్లో సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారం(Surya Namaskaras) చేస్తూ ఆసనాలు(Asana) వేయడం వల్ల ఎంతో ప్రయోజనం(Benefits) కలుగుతుంది.

సూర్య నమస్కారా(Surya Namskaras)లు శరీర బరువు(Body Weight)ను తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సూర్య నమస్కారం చేసే పద్ధతి వల్ల పొట్ట(Stomach) భాగంలోని ఖండరాల(Muscles) పై ఒత్తిడి(Stress) పడి బెల్లి ఫ్యాట్(Belly Fat) సులభంగా తగ్గుతుంది.అదే విధంగా మెటబాలిజం(Metabolism) స్థాయిపెరగడానికి కూడా సహాయపడుతుంది.

రక్త ప్రసరణ(Blood Circulation), జీర్ణ క్రియ(Digestive System)ను మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారాన్ని ఒక్క రౌండు పూర్తి చేయడం ద్వారా 13.9 క్యాలరీల బరువు  కోల్పోయేటట్లుగా చేస్తుందని చెప్తున్నారు యోగ ఫిట్నెస్ నిపుణులు(Yoga Fitness Experts). వెన్నులో నరాల(Nerves)ను మెరుగుపరుస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లెమ్(Breathing Problem) కి చెక్ పెడుతుంది. గ్యాస్ట్రిక్(Gastric), అల్సర్(Ulcer) లాంటి ఆరోగ్య సమస్యలకు మన దరికి కూడా చేరవు.

మహిళల్లో వచ్చే గైనిక్ సమస్యలు(Gayneic Problems)  కూడా దూరమవుతాయి.  కాళ్లల్లో ఎముకలు(Bones) గట్టి పడతాయి. నరాలు సాగి ఫ్రీ వాక్(Free Walk) చేయగలుగుతాం. శరీరం(Body)లో ఎక్స్ట్రా కొవ్వును(Extra Fat) కరిగిస్తాయి.

సూర్య నమస్కారం(Surya namaskaram) చేయడం ద్వారా సూర్యుడి నుంచి  నేరుగా శక్తి(Power)ని పొందేందుకు శరీర వ్యవస్థను మేలుకొల్పవచ్చు. సూర్యుడు ఉదయించే వేళలో ఖాళీ కడుపుతో సూర్య కిరణాలూ  శరీరంపై ప్రసరించే దిశలో నిలబడి సూర్య నమస్కారాలు చేయడం సరైనదని పెద్దలు సూచిస్తున్నారు.

గదిలో సూర్య నమస్కారాలు చేసుకునే వారు ఆ గదిలోకి వెలుతురు(Light), గాలి(Air) ఎక్కువగా ప్రసరించేలా చూసుకోవాలి.శరీరం సాగు గుణాన్ని బట్టి పన్నెండు రకాల సూర్య నమస్కారాల్లో ఏది నప్పితే దాన్ని ప్రాక్టీస్(Practice) చేయడం ఉత్తమం.

గర్భిణీలు(Pregnant Women), అధిక రక్తపోటు(Blood Pressure) తో బాధపడే వాళ్ళు సూర్య నమస్కారాలు చేయకూడదు. నిద్రలేమి(Insomnia) తో బాధపడే వారికి చక్కటి పరిష్కారం.

నెలసరి సమస్య(Menstrual Problem)తో బాధపడేవారు సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. యోగా(Yoga)లో అత్యంత ప్రాచీనం(Ancient) పొందిన ఆసనా(Asana)లలో సూర్య నమస్కారం ఒకటి.

మనసును శరీరాన్ని ఆహ్లాదపరిచే అభ్యసం(Practice)గా వుంటూ ఒత్తిడి(Stress) ఆందోళనను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల(benefits)ను పొందే వీలున్న సూర్య నమస్కారాల(Surya Namaskaras)ను మీరు కూడా నేటి నుంచి ప్రారంభించండి. ఆరోగ్యంగా వుండండి..