బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) గురువారం 8వ వారం కెప్టెన్(Captain) పోటీదారుల టాస్క్ ముగిసింది. సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్, ఆనీ, శ్రీరామ్ ఈ ఆరుగురు కెప్టెన్ పోటీదారులు గా బరిలో వున్నారు. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు.

ఈ టాస్క్(Task) లో కంటెస్టెంట్స్(Contestants) మధ్య  జరిగిన రచ్చ ఏంటో గురువారం జరిగిన  54వ ఎపిసోడ్ హైలైట్స్‌ చూద్దాం.

మానస్, ప్రియాంక ముచ్చట్లు పెట్టుకుంటారు. ప్రియాంక తన ఫ్యూచర్ తెలిసిపోయిందని , నేను 10వ వారంలోఎలిమినేట్(Eliminate) అవుతానని అనిపిస్తోందని

మానస్‌తో చెప్పింది ప్రియాంక. అదేం లేదు కానీ నిన్ను టార్గెట్ చేస్తారు అంతే అని అన్నాడు మానస్. దీంతో ప్రియాంక రవి ప్రస్తావన తీసుకొచ్చింది.

యాంకర్‌ రవి బిగ్‌బాస్‌(Big Boss) హౌస్‌లో అడుగు పెట్టిన మొదటిరోజు నుంచే గేమ్‌ ఆడటం మొదలు పెట్టాడని పింకీతో చెప్పుకొచ్చాడు మానస్‌.

ఈ హౌస్‌లో అతడితో ఫ్రెండ్‌షిప్‌ చేయాలని, అతడిని దగ్గర చేసుకోవాలని ఎవరికీ లేదన్నాడు. మరోవైపు రవి అర్ధరాత్రి సిరి, షన్ను, జెస్సీ వున్న బెడ్ దగ్గరకు వెళ్లి ఇంకా నిద్రపోని షణ్ను, సిరి కాలికి దండం పెట్టాడు.

తర్వాత రోజు సిరి సడన్‌గా షణ్నుకు ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీంతో షాకైన షణ్ను ముసిముసిగా నవ్వుతూనే కెమెరాల(Camera) వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్‌(Record) చేశారా? నాకు ఉంటదిపుడు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు . కాసేపటికే మళ్లీ వచ్చిన సిరి నీ వల్లే మెంటల్‌గా డిస్టర్బ్‌(Disturb) అవుతున్నానని చెప్పింది. నేను నీతో ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? అని షణ్నుని అడిగింది.

వీటికి షణ్ను బదులిస్తూ నా వల్ల చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని ఒక్క మాట తో  తేల్చేశాడు.

నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే నేను మాట్లాడనురా, అదే బెస్ట్‌ అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి మళ్లీ అలిగి వెళ్లిపోయింది.

తర్వాత ‘వెంటాడు- వేటాడు’ కెప్టెన్సీ టాస్క్(Captaincy Task) ప్రారంభమైంది.

ఇందులో భాగంగా థర్మాకోల్‌ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్‌ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. గేమ్‌ ముగిసేసరికి ఎవరి బ్యాగులో ఎక్కువ థర్మాకోల్‌ ఉంటే వారే విజేతలుగా నిలుస్తారు .

ఈ ఆటలో  సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్, ఆనీ, శ్రీరామ్  పోటీ పడ్డారు. ఈ టాస్క్‌కి సంచాలకులుగా జెస్సీ వ్యవహరించాడు. అయితే ఈ టాస్క్‌ని నడిపించాల్సిన జెస్సీకి గేమ్ అర్థం కాకపోవడంతో గేమ్ ని కరెక్ట్ గా ఆడించలేకపోయాడు.

మొదటి రౌండ్‌లో షణ్ముఖ్‌తో పాటు శ్రీరామ్‌ని సర్కిల్ బయటకు నెట్టేశారు. దీంతో వాళ్లిద్దరూ ఔట్ అని ప్రకటించాడు జెస్సీ.

అసలు టాస్క్‌ ని ఎలా ముందుకు నడిపించాలో అర్థంకాక కన్ఫ్యూషన్ లో వున్నా జెస్సీ ని బిగ్ బాస్(Big Boss) కన్ఫెషన్ రూం(Confession Room)కి పిలిచి అసలు నీకు గేమ్ అర్థం అయ్యిందా? అని చురకలేసి గేమ్‌ని ఆడించే విధానాన్ని వివరించారు.

ఆ తరువాత మొదటి  రౌండ్‌ని సంచాలకుడిగా రద్దు  చేసే హక్కు నీకు ఉంటుందని రవి సలహా ఇవ్వడంతో గేమ్‌ని మళ్లీ మొదట నుంచి మొదలుపెట్టించాడు జెస్సీ.

అయితే ఈ రౌండ్‌లో సన్నీ-శ్రీరామ్‌లో కింద మీద పడి ఒకర్నొకరు టార్గెట్ చేసుకున్నారు. దీంతో సన్నీ ఫస్ట్ రౌండ్‌లో గేమ్ నుంచి బయటకు వచ్చేశాడు.

కొట్లాటలో సన్నీ-శ్రీరామ్ ఇద్దరూ కింద పడిపోయారు. టాస్క్(Task) ప్రకారం వాక్ ఆపితే వాళ్లు ఔట్. ఆ లెక్కన శ్రీరామ్, సన్నీ ఇద్దరూ గేమ్ నుంచి తప్పుకోవాలి. కానీ సన్నీని మాత్రమే గేమ్ నుంచి ఔట్ అని శ్రీరామ్‌ని కంటిన్యూ చేయించాడు జెస్సీ.

కానీ అతడు గేమ్‌ నుంచి వెళ్లిపోతూ తన ఫ్రెండ్‌ మానస్‌ను గెలిపించాడంటూ కౌంటర్ ఇచ్చాడు  శ్రీరామ్‌. ప్రియగారు కరెక్ట్‌ ఆడారంటూ అతడిని రెచ్చగొట్టాడు.

అయితే శ్రీరామ్ మాటలతో రెచ్చగొడితే సన్నీ కంట్రోల్ తప్పి మీది మీదికి వెళ్లాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.

తర్వాత రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్‌ను కింద పడేయగా సంచాలకుడైన జెస్సీ వీళ్లిద్దరూ అవుట్‌ అని ప్రకటించాడు. అతడి నిర్ణయంతో ఏకీభవించని సన్నీ జెస్సీ ముందున్న బ్యాగును తంతూ రెచ్చిపోయాడు. మానస్‌ అవుట్‌ కాదంటూ వాదనకు దిగాడు .

తర్వాత రౌండ్‌లో ముగ్గురు మిగలగా షణ్ను, సిరి యానీని టార్గెట్‌(Traget) చేశారు. దీంతో యానీ ‘ఇండివిడ్యువల్‌ గేమ్‌(Individual Game) లేదు, నిజాయితీ లేదు’ అంటూ సిరిని నెట్టేసింది.

అయితే ఆమె తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి చేతిలో పట్టుకుంది. ఇది చూసి షాకైన హౌస్ మేట్స్ అది తప్పంటూ వారించడంతో సిరి  చాకు కిందపడేసింది.

అయితే అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని, అలాంటప్పుడు తాను ఒంటరిగా ఆడి ఎలా కెప్టెన్‌(Captain) అవ్వగలనంటూ బాధపడింది యానీ. దీంతో స్వచ్ఛందంగా గేమ్‌లో నుంచి తప్పుకుంది.

ఈ ఇంట్లో ఉన్నంతవరకు తాను కెప్టెన్‌ అవ్వను అంటూ ఏడ్చేసింది. ఆమెను ఓదార్చేందుకు వెళ్లిన సన్నీ పై కూడా మండిపడింది. నా కళ్ల ముందుకు రాకంటూ వార్నింగ్‌ ఇచ్చింది.’

పందులే గుంపులుగా ఆడతాయి, సింహం సింగిల్‌గా ఆడుతుంది’ అంటూ డైలాగులు చెప్పింది .’

గేమ్‌లో షణ్ముఖ్‌ నా దగ్గరకు వస్తున్నాడు, మొగోడు ఆడే ఆట ఇదేనా’ అని మండిపడిపోయింది. చివరి రౌండ్‌లో సిరిపై షణ్ముఖ్‌ విజయం సాధించి కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో అతడికి హగ్గుల మీద హగ్గులిచ్చింది సిరి.

మరోవైపు మానస్‌ ఎవరెవరిని టార్గెట్‌ చేయాలో ఫిక్సయ్యానని సన్నీతో చెప్పుకొచ్చాడు. కానీ పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు. చేతులు కట్టుకుని కూచున్నా అంటున్నారు, అటాక్‌ అంటే ఏంటో చూపిస్తానని ఫిక్సయ్యాడు మానస్‌. ఎట్టకేలకు ఎనిమిదో వారం కెప్టెన్(Captain) గా షన్ను గెలవడం హౌస్ మేట్స్(House mates) లో కొందరికి అన్ఫెయిర్ గా  అనిపిస్తోంది. మరి ఈ వారం జరిగిన ఈ టాస్క్(Task) ల గురించి నాగ్ సార్ ఎం చెప్పనున్నాడో చూడాలి