బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) 8వ వారం కెప్టెన్(Captain) పోటీదారుల టాస్క్ ‘అభయహస్తం’ ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది.

ఈ టాస్క్‌లో భాగంగా మొత్తం ఐదు ఛాలెంజ్‌లో విజేతలుగా నిలిచే ఐదుగురు కంటెస్టెంట్స్(Contestants) కెప్టెన్ పోటీదారులుగా పోటీచేయనున్నారు.

ఇప్పటికే సిరి, షణ్ముఖ్‌, శ్రీరామ్ ముగ్గురూ గెలిచి కెప్టెన్ పోటీదారుల బరిలో వున్నారు.కేవలం కెప్టెన్ పోటీదారులుగా గెలిచిన వారికి మాత్రమే హౌస్‌లోకి ఎంట్రీ ఉండటంతో సిరి, షణ్ముఖ్‌, శ్రీరామ్ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్లందరికీ తిండి తో పాటు పడుకోవడం కూడా అంతా బయటే.

దీంతో దుప్పట్లు, చాపలు వేసుకుని బయటే పడుకున్నారంతా. ఈ చాపలు ఏంటో ఈ బయటపడుకోవడం ఏంటో.. మీకు మనసులేదు అంటూ బిగ్ బాస్‌పై పంచ్‌లు వేశాడు సన్నీ.

మరింతగా బిగ్ బాస్(Big Boss) హౌస్ లో ఎం జరిగిందో తెలియాలంటే 53వ ఎపిసోడ్‌ పై నాతో పాటు మీరు  ఓ లుక్ వేసేయండి…..

ఇక కెప్టెన్సీ కంటెండర్స్‌(Captaincy contender) టాస్క్‌ లో అందరూ పాల్గొనడానికి వీల్లేనందున ఎవరు టాస్క్(Task) నుంచి తప్పుకుంటారన్న దానిపై హౌస్‌మేట్స్‌ చర్చించారు.

కెప్టెన్‌ సన్నీ మాట్లాడుతూ టాస్క్‌ ఆడానన్న  జెస్సీ మళ్లీ వచ్చి ఆడతానంటున్నాడని హౌస్ మేట్స్(House mates)  దగ్గర డిస్కస్ చేస్తాడు.

జెస్సీకి ఆడాలని ఉన్నందున అతడి కోసం టాస్క్‌ లో నుంచి వైదొలగడానికి యానీ, సన్నీ రెడీ అవుతారు. కానీ జెస్సీ మాత్రం తను అన్‌ఫిట్‌ అని, తనే డ్రాప్‌ అవుతానని చెప్పాడు. తనకోసం యానీ టాస్క్‌ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదన్నాడు.

ఆమె గేమ్‌ ఆడి గెలవాలని, ఎందుకంటే ఆమె అందరికీ వండి పెడుతుందని, ఒకవేళ కెప్టెన్‌ అయితే ఇంకొన్ని వారాలు ఆమె అందరికి వంట చేస్తుందని, ఇంట్లో ఎవరికీ వంట రాదనీ  చెప్పుకొచ్చాడు.

‘అభయహస్తం’ అనే కెప్టెన్సీ టాస్క్‌ లో నాలుగో ఛాలెంజ్‌(Challenge) గా ‘రంగు పడుద్ది’ అనే టాస్క్(Task) ఇచ్చాడు బిగ్‌బాస్‌(Big Boss). ఈ

ఛాలెంజ్‌లో కాన్వాస్‌(Canvas)పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు విజేతలు అని ప్రకటించారు. ఈ టాస్క్‌ లో ప్రియాంకపై యానీ గెలవడంతో పాటు హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది యాని మాస్టర్.

మరోపక్క షణ్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్‌ చేద్దాంరా అని తన మనసులోని మాటను బయటపెట్టింది సిరి. దీంతో విసుకున్న షణ్ను ‘హమీదా కూడా ఇంతే వర్క్‌ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను’ అని అసహనం ప్రదర్శించాడు.

దీంతో హర్ట్‌ అయిన సిరి ‘నీతో సాంగ్‌ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా?’ అని మండిపడింది. సిరి హర్ట్(Hurt) అయ్యి అలక పాన్పు ఎక్కిందని అర్థమైన షణ్ను వెంటనే సారీ చెప్పాడు. కానీ అప్పటికే కోపంలో ఉన్న సిరి ‘ఎవడిక్కావాల్రా సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి నాకు ఒళ్లు మండిపోతుంది’ అని నిప్పులు చెలరేగింది. ఇక ఎప్పటిలాగే కాసేపటికే ఇద్దరూ తిరిగి కూల్ అయ్యిపోయారు.

తరువాత 5వ చాలెంజ్‌ గా ‘కారులో హుషారుగా’ టాస్క్‌ లో భాగంగా పోటీదారులు బొమ్మ కారును నడిపిస్తూ పూల కుండీలను వారి బాక్స్‌ లో పెట్టాల్సి ఉంటుంది.

ఈ టాస్క్‌(Task) లో కాజల్‌పై సన్నీ గెలిచాడు. ఇంతటి తో అభయ హస్తం టాస్క్ పూర్తయిందని ప్రకటించిన బిగ్ బాస్(Big Boss). అయితే కాజల్‌ గేమ్‌ లైట్‌ తీసుకుందని షణ్ను, సిరితో చెప్పుకొచ్చాడు రవి.

ఈ క్రమంలో హౌస్‌లో కొద్దివారాలుగా ఎదుర్కొంటున్న స్ట్రెస్ ని చెప్పుకొచ్చాడు. అయితే రవి ‘నేను డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. దానిక్కూడా నేను రెడీనే , కానీ ఈ స్ట్రెస్(Stress) నా వల్ల కావడం లేదు’ అని వాపోయాడు. మరోపక్క మానస్‌ రవి గేమర్‌ అని చెప్పుకొచ్చాడు. అతడు ఎప్పుడు? ఎవరొక్కరిని ఎలిమినేట్‌(Eliminate) చేయాలి? అని ప్లాన్‌ చేస్తుంటాడని కాజల్‌తో మానస్ అంటాడు.

ఇక  ఆ తరువాత ‘బంతిలో ఉంది భాగ్యం’ అనే స్పెషల్‌ టాస్క్‌(Special Task) తో కెప్టెన్సీ(Captaincy) పోటీదారులయ్యేందుకు హౌస్‌మేట్స్‌(House mates) కు మరో ఛాన్స్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌(Big Boss).

ఈ ఆటలో బజర్‌ మోగినప్పుడు సర్కిల్‌లో ఉన్న బాల్ ని  సాధించిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి ఒకరిని ఎలిమినేట్‌(Eliminate) చేయవచ్చు.

ఈ గేమ్‌లో వరుసగా బంతి సాధించిన మానస్‌ విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్‌, పింకీలను ఎలిమినేట్‌ చేసి కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యాడు.

మొత్తానికి ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, యానీ, సన్నీ, మానస్‌ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు తెలిపాడు.

అంతేకాకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లో లాక్‌డౌన్‌(Lock down) ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు బిగ్ బాస్.