లేడీ ఓరియెంటెడ్(Lady Oriented) మూవీస్ కి కేరాఫ్‌గా మారిన హీరోయిన్ అనుష్క(Anushka) .సూపర్ మూవీతో కెరీర్ మొదలు పెట్టిన అనుష్క అరుంధ‌తితో సూప‌ర్‌ స్టార్ గా ఎదిగింది ఓ ప‌క్క స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే భాగ‌మ‌తి వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించింది.

నిశ్శబ్దం సినిమా చేసిన అనుష్క దాదాపు మూడేళ్ల త‌ర్వాత చేసిన సినిమా ‘Miss శెట్టి MR పొలిశెట్టి’. అనుష్క‌ కు జంట‌గా న‌వీన్ పొలిశెట్టి(Naveen Polishetty) హీరోగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌(Teaser)ను మేక‌ర్స్(Makers) రిలీజ్ చేశారు. అనుష్క శెట్టి ఇందులో అన్విత ర‌వళి అనే చెఫ్ పాత్ర‌(Chef Role)లో క‌నిపిస్తోంది. కాగా న‌వీన్ పొలిశెట్టి స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌(Standup Comedian)గా న‌టిస్తున్నాడు.

వీరిద్దరి మ‌ధ్య ప్రేమ ఇత‌ర ఎమోష‌న‌ల్ అంశాల క‌ల‌యిక‌గా ‘Miss శెట్టి MR పొలిశెట్టి’ రూపొందుతోందని టీజ‌ర్ చూస్తే అర్థమ‌వుతుంది.

న‌వీన్ వేసే కుళ్లు జోకులు దానికి అనుష్క ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్‌(Expressions), విజువ‌ల్స్(Visuals), మ్యూజిక్(Music) అన్నీ బావున్నాయి. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌(Yuvi Creations Banner)పై మ‌హేష్ బాబు.పి(Mahesh Babu P) ద‌ర్శక‌త్వం(Direction)లో ఈ మూవీ రూపొందుతోంది.

యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఇంత‌కు ముందు అనుష్క భాగ‌మ‌తి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ కొట్టింది. త‌ర్వాత ఇదే బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్ర‌మే ‘Miss శెట్టి Mr పొలిశెట్టి’. నీర‌వ్ షా(Neerav Sha) సినిమాటోగ్రఫీ(Cinematography) అందిస్తోన్న ఈ చిత్రానికి ర‌ధ‌న్(Radhan) సంగీతాన్ని(Music) అందిస్తున్నారు.

అనుష్కకు సైజ్ జీరో సినిమా చాలా ఇబ్బందుల‌ను క్రియేట్ చేసింది. ఆ సినిమా కోసం అనుష్క పెరిగిన బ‌రువును తగ్గించుకోలేక‌పోయింది. చాలా రోజుల పాటు బ‌రువు త‌గ్గే ట్రీట్‌మెంట్ తీసుకున్న‌ప్ప‌టికీ ఆమె మాత్రం మ‌నుప‌టిలా స్లిమ్ కాలేక‌పోతుంద‌నే వార్తలు వ‌స్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ‘Miss శెట్టి Mr పొలిశెట్టి’ మూవీలో అనుష్క ఎలా కనిపిస్తుందనేది అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ పోసర్ట్స్‌లో మాత్రం అనుష్క స్లిమ్‌గా కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ(Release Date) క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.