ఇళ్ళల్లో సాధారణంగా నేలను చీపురుతో ఊడ్చి తడి గుడ్డ పెడుతుంటారు. ఇది ప్రతీ రోజూ అందరి ఇళ్ళల్లో జరిగే పనే. అయితే ఆ తరువాత ఎప్పుడైనా ఆ నేల పరిశుభ్రతను గూర్చి ఆలోచించారా. నూటికి నూరు శాతం ఎవరూ ఆలోచించరు. తడి గుడ్డ పెట్టడంతో ఆపని అయిపోయింది అనుకుంటారు కానీ కాదు. ఎందుకంటే మనం నేలను తుడిచే తడి బట్టనే పదే పదే వాడుతుంటాం, దానిని ఏ మాత్రం శుభ్రం చేయకుండా. అందువల్లే కొన్ని రకాల క్రిములు శాశ్వతంగా మన ఇళ్ళల్లో కొన్ని మూలల్లో తిష్ట వేస్తున్నాయన్నది మనం అంగీకరించాల్సిన నిజం. ఇల్లే కాదు, కార్యాలయం, హోటళ్ళు, ఇలా ఎక్కడైనా పని వాళ్ళు తడి గుడ్డ లేదా మాప్ తో తుడుస్తుంటారు. కానీ అక్కడ ఎంత మేరకు శుభ్రత ఉంది అనే పరీక్షకు నిలిస్తే మనకు కళ్ళు తిరిగే నిజం బయట పడుతుంది.

Pogo Clean working

Pogo Clean working

మరి ఈ పరీక్షలో నెగ్గి నిజమైన పరిశుభ్రతకు చిరునామా నిలిచే ఒక mop ఉంది అదే ఈ Pogo clean mop. ఇలాంటి mop ప్రపంచoలో ఇదే మొదటిది కావడం విశేషం. ఇది చూడటానికి మన ఇళ్ళు తుడిచే సాధారణ mop లానే కనిపిస్తుంది కానే ఒక చిన్న తేడా. ఇది బాటరీ తో పని చేస్తుంది. అలాగే ఇది చాలా తేలిగ్గా ఉండటంతో పాటు పూర్తి వైర్లెస్ కూడా. దీనిని ఇంట్లో ఎలాంటి నేల మీదైనా తుడవచ్చు. ఈ mop లో ఉండే microfibre బ్రష్ అత్యంత వేగంగా తిరుగుతూ మురికిని శుభ్రం చేయడంతో పాటు ఎలాంటి ద్రవ పదార్ధం/తడి మరకలనైనా తుడిచేస్తుంది. ఎంత వేగంగా అంటే దీనిలో ఉండే 75 మిలియన్ మైక్రోఫైబరు పాడ్స్ సెకనుకు 66 సార్లు తిరుగుతూ మురికిని తిరిగి నేల మీదకు చేరనివ్వకుండా శుభ్రం చేస్తుంది. ఈ టెక్నాలజీ పేటెంట్ చేయబడింది. శుభ్రత గురించి చెప్పాను కదా, ఇక పరీక్ష విషయానికి వద్దాం. దీనిని స్వయంగా కొంత మంది ఇళ్ళల్లో (Hygiene testing meter) తో పరీక్షించి చూస్తే వారి సాధారణ mop తో తుడిచినప్పుడు వారి నేల మీద శుభ్రత లేమి 1576 కాగా, Pogo Clean తో తుడిచిన తరువాత కేవలం ఆ సంఖ్య 4 కు వచ్చింది. ఇలా ఎంతో మంది ఇళ్ళల్లో నిరూపించి చూపించారు.

Hygiene test

Hygiene test

ఈ బాటరీని రీ-చార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కసారి చార్జ్ చేస్తే 45 నిముషాలు పని చేస్తుంది. ఆ పైన దీనిని శుభ్రం చేయడం ఎలా అంటే మురికిగా అనిపించినప్పుడు ఈ మైక్రోఫైబర్ బ్రష్ ను వాషింగ్ మెషిన్ లేదా చేత్తో ఉతికి ఆరేస్తే మళ్ళీ పని చేయడానికి సిద్ధం.

ఇంట్లో అతిగా ఎవరికైనా అలర్జీలు ఉన్నా, ఇంటి శుభ్రత పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్న, క్రిముల గురించి అధికంగా (మహానుభావుడు సినిమా మాదిరి) అతిగా ఆలోచిస్తున్నా ఎవ్వరికైనా ఇది ఇంట్లో ఉండాల్సిన పరికరమే కదూ. సరే, మరి ఇంత గొప్ప శుభ్రత కొంచెం ఖరీదులోనే దొరుకుతుంది. దీని ధర $299.