లవ్‌స్టోరీ(Love Story) మరియు బంగార్రాజు(Bangarraju) చిత్రాలతో సక్సెస్(Success) బాటలో దూసుకుపోతున్న అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya). ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీ(Busy)గా ఉన్నాడు చైతూ. బాలీవుడ్(Bollywood)​ మిస్టర్ పర్​ఫెక్ట్​ అమీర్ ఖాన్​(Amir khan)తో లాల్​ సింగ్​ చద్దా(Laal Singh Chadda) సినిమాలో నాగా చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడి(pair)గా రాశిఖన్నా(Raashi Khanna) నటిస్తుండగా.. అవికా గోర్(Avika Ghor), ప్రకాష్ రాజ్(Prakash Raj) ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు(Dil Raju) నిర్మాత.

ఇదిలా ఉంటే నాగ చైతన్య(Naga Chaitanya) ఓ వెబ్ సిరీస్(Web Series) లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్​ను ప్రముఖ ఓటీటీ(OTT) దిగ్గజం అమెజాన్ ప్రైమ్(Amazon Prime) సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌(Huge Budget)తో రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీ OTT ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్మించబడే వెబ్ సిరీస్ షూటింగ్‌(Shooting)ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌(Crime Thriller)గా తెరకెక్కుతున్న,ఈ వెబ్ సిరీస్‌కు ’24’ ఫేమ్ డైరెక్టర్(24 Frame Director) విక్రమ్ కుమార్(Vikram Kumar) దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సిరీస్‌లో చై జర్నలిస్ట్(Journalist)​గా, నెగెటివ్​ పాత్ర(Negative Role)లో చేస్తున్నట్లు సమాచారం. అందులో చైతన్య మేకోవర్​ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్​. మొత్తం మూడు సీజన్​లుగా ఈ వెబ్ సిరీస్​ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

వెబ్ సిరీస్‌(Web Series) లో మూడు సీజన్లు(Three Seasons) ఉంటాయి. ఇతర మూలాధారాలు కూడా ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఈ సిరీస్ కథ టైమ్ ట్రావెల్(Time Travel) చుట్టూ తిరుగుతుందని మరియు ప్రతి సీజన్‌లో దాదాపు 8-10 ఎపిసోడ్‌లు ఉంటాయని నివేదిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో చైతన్యకి జంటగా ప్రియా భవానీ శంకర్‌(priya Bhavani Shankar)తో రొమాన్స్ చేయనుంది. చైతు టైం ట్రావెల్ లాంటి వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్​గా నెగెటివ్​ రోల్(Negative Role) చేస్తే మంచి ఛాలెంజింగ్​ పాత్ర(Challenging Role) లో నటించే ఛాన్స్(Chance) కొట్టేసినట్టే. మరి చై నెగటివ్ రోల్ లో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలంటే వెబ్ సిరీస్‌(Web Series) వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.