నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) లిమిటెడ్(Limited) జూనియర్ ఇంజనీర్(JE) పోస్టుల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌ను 31 జనవరి 2022న nhpcindia.comలో యాక్టివేట్ చేసింది. అర్హత,ఆసక్తి గల  ఇంజనీర్లు 21 ఫిబ్రవరి 2022లోగా NHPC JE దరఖాస్తును సమర్పించవచ్చు. మొత్తం 133 ఖాళీలు(133 Posts) అందుబాటులో ఉన్నాయి, వీటిలో 68 సివిల్ ఇంజనీర్లకు(CV), 34 ఎలక్ట్రికల్ ఇంజనీర్ల(EV)కు మరియు 31 మెకానికల్ ఇంజనీర్ల(ME)కు ఉన్నాయి. NHPCతో ఆన్‌లైన్‌(Online)లో నమోదు చేసుకునే అభ్యర్థులు మరియు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన అన్ని సమాచారాన్ని పూరించిన అభ్యర్థులు(Candidates) కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(CBT Exam)కు హాజరు కావడానికి తాత్కాలికంగా అనుమతించబడతారు.

ఎన్‌హెచ్‌పీసీ జూనియర్ ఇంజనీర్ ఖాళీ 2022 వివరాలు:

పోస్టు: జూనియర్ ఇంజనీర్ (సివిల్)

ఖాళీలు: 68

పోస్టు: జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)

ఖాళీలు: 34

పోస్టు: జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)

ఖాళీలు: 31

విద్యార్హతలు: అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ప్రభుత్వ(Government) / ప్రభుత్వ గుర్తింపు(Govt. Recognized) పొందిన సంస్థల నుండి సివిల్(Civil)/ఎలక్ట్రికల్(Electrical)/మెకానికల్ ఇంజనీరింగ్‌(ME)లో పూర్తి సమయం రెగ్యులర్ డిప్లొమా(Regular Diploma) కలిగి ఉండాలి.

పే స్కేల్: జేఈ పోస్టులకు సెలెక్టన అభ్యర్థులకు నెలకు రూ.29,600 నుంచి 1,19,500 జీతం లభిస్తుంది.

వయోపరిమితి: 30 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: పరీక్ష రుసుము(Exam Fee)ను ఆన్‌లైన్‌లో చెల్లించండి. జనరల్ అభ్యర్థులు(General Candidates), OBC & EWS వర్గానికి: 295/-, SC/ST/PWD/Ex-Servicemen కేటగిరీ కోసం రుసుము లేదు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: జనవరి 31, 2022

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2022

దరఖాస్తు చేసుకునే విధానం :

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్(Official Website) http://nhpcindia.com/ ఓపెన్‌ చేయాలి.
  • వెబ్‌సైట్ హోమ్ పేజీలో కెరీర్‌(Career)పై క్లిక్ చేయండి .
  • రిక్రూట్‌మెంట్(Recruitment) లింక్‌ పై క్లిక్‌ చేయాలి
  • రిజిస్ట్రేషన్(registration) కోసం ఇక్కడ ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు(Candidates) తమ అప్లికేషన్ నంబర్(Application Number), పాస్‌వర్డ్‌(Password)ను నమోదు చేయాలి.
  • రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తు ఫారమ్‌(Application Form)ను పూర్తి చేసి సబ్మిట్ బటన్(Submit Button) క్లిక్ చేయాలి .