బిగ్ బాస్(Big boss) రియాలిటీ షో సీజన్ 5 మూడో వారం ఎలిమినేషన్ (Elimination) తో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన లహరి. హౌస్ లో మొత్తం 19 కంటెస్టెంట్స్ లో ముగ్గురు ఎలిమినేట్ అవ్వడంతో 16 మంది కంటెస్టెంట్స్ వున్నారు. గత మూడు వారాలు గా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతుండడం గమనార్హం. మరి ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందా?  ఎలిమినేషన్ ప్రక్రియ ఆడియన్స్ ఇచ్చిన వోటింగ్ ప్రకారం జరిగిందా లేక బిగ్ బాస్ నిర్ణయంతో జరిగిందో  తెలియట్లేదు.

ప్రతి వారం ఊహించని విధంగా కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ ప్రక్రియ తో చిచ్చు రాజేస్తోన్న బిగ్ బాస్. ఈ సారి సీజన్ లో ఎంటర్టైన్మెంట్ కంటే కూడా గొడవలు, కొట్లాటలతో యుద్ధ రాగాన్ని తలపిస్తున్న బిగ్ బాస్ హౌస్. మూడో వారం ప్రియా, లహరి ల మధ్య జరిగిన  గొడవ తార స్థాయికి చేరింది.

నాల్గో వారం లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్, అది కాస్త సోమవారం నామినేషన్స్ డే అన్న విషయం తెలిసిందే. ప్రతి సోమవారం నామినేషన్(Nomination) ప్రక్రియ తో గొడవలకు, రచ్చకి హౌస్ మేట్స్ మధ్య మొదలవుతుంది. మరి ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేసారో, ఎవరి మధ్య హీట్ డిస్కషన్స్ జరిగిందో చూసేద్దామా.

ప్రతివారం లాగే ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేయాలి. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ఫొటోలోని ఒక భాగాన్ని తీసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో గల కారణాలు చెప్పి దాన్ని స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని తెలిపాడు బిగ్ బాస్(Big boss).

మొదటగా ప్రియతో ఈ నామినేషన్(Nomination) ప్రక్రియను మొదలుపెట్టాలని చెప్పారు బిగ్ బాస్. అందులో భాగంగా, మొదట  ప్రియ- లోబో, సన్నీ.. విశ్వ- రవి, నటరాజ, మాస్టర్.. లోబో- ప్రియ, సిరి..  శ్రీరామ్- శ్వేత వర్మ, యాని మాస్టర్.. షణ్ముఖ్ జస్వంత్- యాంకర్ రవి, లోబో.. నటరాజ్ మాస్టర్- ఆర్జే కాజల్, సన్నీ..

సిరి- ఆనీ మాస్టర్, లోబో..  మానస్- లోబో, నటరాజ్ మాస్టర్.. శ్వేతా- లబో, యాంకర్ రవి.. హమీదా-నటరాజ్ మాస్టర్, లోబో.. నటరాజ్ మాస్టర్- విశ్వ, రవి..ఆనీ మాస్టర్.- సిరి, రామ్.. సన్నీ- ప్రియ, కాజల్.. జెస్సీ- ప్రియాంక,రవి.. ప్రియాంక- లోబో, కాజల్.. యాంకర్ రవి- కాజల్, నటరాజ్ మాస్టర్.

లోబో, సన్నీలు తనకి దూరంగా ఉంటున్నారని.. వాళ్లతో మాట్లాడిన, క్లోజ్ అవ్వడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా తనతో  మాట్లాడడం లేదని  అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది ప్రియ. తరువాత  ప్రియను తిరిగి నామినేట్(Nominate) చేస్తూ లోబో కోపంతో ఊగిపోయాడు.

loboఅందరు తమ  లవ్ స్టోరీలు చెప్తుంటే, తాను తన 14 ఏళ్లుగా ఓ అమ్మాయిని లవ్ చేశా అని,  తన లవ్ స్టోరీ  చెప్తే.. సినిమా కథలా ఉందని చెప్పావు .. ఆ నిమిషం నా ఖలేజా పగిలిపోయింది. అంటూ వియర్డ్ గా ప్రవర్తించాడు లోబో. ప్రియా ఆలా కాదు అని ఎదో చెప్పబోతుంటే గట్టిగా  అరుస్తూ ప్రియ మీదికి  వెళ్లాడు.

హౌస్ మేట్స్(House mates) లోబోని  కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా తన అసభ్యకర ప్రవర్తనతో రెచ్చిపోయాడు. ఆ తరువాత ఏడుస్తూ రవి తో నీకు తెలియదా నా గురించి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు, దింతో  రవి వచ్చి లోబోని ఓదార్చాడు. అయితే ప్రియ మాత్రం అతని వింత  ప్రవర్తనకు ఏం చేయాలో అర్థంకాక మౌనంగానే ఉండిపోయింది. చివర్లో మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడకు లోబో అంటుంది.

రవితో గొడవ అయిన కారణంగానే లోబో తనని నామినేట్ చేశాడని ఇన్ డైరెక్ట్‌గా చెప్పింది. ఆ గొడవ అయినప్పటి నుంచి లోబో తనతో మాట్లాడటం మానేశాడని అంతుకు ముందు చెప్పింది ప్రియ. తరువాత  లోబో అంత గట్టిగా తన మీద అరవడంతో ఎమోషనల్ అయ్యి  ఏడ్చేసింది ప్రియా.

లోబో ప్రియాల మధ్య జరిగిన ఈ రచ్చ రవి లహరిల విషయాన్ని మనసులో పెట్టుకుని కావాలనే లోబో ప్రియను టార్గెట్(Traget) చేసినట్టు అనిపిస్తోంది. ఆ విషయం తేలాలంటే బిగ్ బాస్(Big boss) లో జరగబోయేది చూడాల్సిందే. ఈ నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఎనిమిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యిన వాళ్ళునటరాజ్, లోబో, రవి, ప్రియ,సిరి, కాజల్, సన్నీ, యాని మాస్టర్.