హీరో ఆది(Hero AADHI) సాయి కుమార్ ఈ ఏడాది వరుసగా చిత్రాలతో స్పీడ్ పెంచేశారు. ఇప్పటికే రెండు చిత్రాలతో ఆడియన్స్(Audience) ని అలరించాడు. తీస్ మార్ ఖాన్(Thees Maar Khan), క్రేజీ ఫెల్లో(Crazy Fellow) అంటూ ఆడియెన్స్‌ ను మెప్పించేందుకు వచ్చాడు.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో మాస్ ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఆది టాప్ గేర్(TOP GEAR) మూవీకి సంబంధించిన అప్డేట్లు(Updates) వచ్చాయి. మోషన్ పోస్టర్లు(Motion Posters), ఫస్ట్ లుక్ పోస్టర్లు(First Look Posters) అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

టాప్ గేర్ చిత్రంలో ఆది సాయి కుమార్ ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలోని కథ మాత్రం ఎవ్వరి ఊహకు అందనట్టుగా ఉంటుందట.

శశికాంత్(Shasi Kanth) దర్శకత్వం(Direction)లో రాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌ (Different Concept) తో వస్తున్న ఈ మూవీని ఆదిత్య మూవీస్(Aditya Movies) &ఎంటర్‌టైన్‌మెంట్స్ (Entertainments) సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌(Sri Dhanalakshmi Productions Banner) నిర్మిస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ(Shooting Completed) పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్(Post Production) పనులు జరుగుతున్నాయని మేకర్లు ప్రకటించారు. అంతే కాకుండా త్వరలోనే ఈ మూవీ నుంచి మొదటి పాట(First Song)ను కూడా రిలీజ్ కానున్నదని టాక్.

ఇక ఈ మూవీని డిసెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టుగా చిత్ర యూనిట్(Movie Unit) అనౌన్స్(Announce) చేసింది. అంటే ఈ ఏడాదిలోనే ఆది మూడు సినిమాలతో సందడి చేసినట్టు అవుతుందన్న మాట. ఈ చిత్రంలో ఆది సరసన రియా సుమన్(Ria Suman) హీరోయిన్‌(Heroine)గా నటించింది.

ఇది వరకు ఈ ఇద్దరి కెమిస్ట్రీకి సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్(Viral) అయ్యాయి. శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) నిర్మాత(Producer)గా రాబోతోన్న ఈ చిత్రంలో శత్రు(Shatru), రేడియో మిర్చి(Radio Mirchi) హేమంత్(Hemanth), బెనర్జీ(Banerji), మైమ్ గోపి(Mym Gopi), నర్రా(Narra), చమ్మక్ చంద్ర(Chammak Chandra), సత్యం రాజేష్(Satyam Rajesh), బ్రహ్మాజీ(Bramaji) వంటి వారు ముఖ్య పాత్రలు(Key roles) పోషించారు.