ధనుష్‌(Dhanush) తెలుగు(Telugu)లోకి ఎంట్రీ(Enntry) ఇస్తూ నటిస్తున్న తొలి చిత్రం `సార్‌(SIR)`. మూవీ తెలుగు, తమిళం(Tamil)లో రూపుదిద్దుకుంటోంది. తమిళంలో ‘వాతీ(Vaathi)’ టైటిల్(Title) తో ప్రేక్షకుల(Audience) ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి(Venki Atluri) డైరెక్ట్(Direct) చేస్తున్నారు. నిర్మాత(Producer) సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) ఈ చిత్రాన్ని సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్(Srikara Studios) తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చాలా షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించేందుకు మూవీ మేకర్స్(Movie Makers) రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్(First Look), ఇంట్రెస్టింగ్ పోస్టర్ల(Intresting Posters)కు అదిరిపోయే రెస్పాన్స్(Response) వచ్చింది. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్(First Single) ను కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్(Music Director) జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)  ఫస్ట్ సాంగ్ పై అదిరిపోయే అప్డేట్(Update) ఇచ్చారు.

వాతీ/సార్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని తెలిపారు. నవంబర్ 10న ఈ పాట విడుదల(Release) కానుంది . తెలుగులో సింగర్ శ్వేత(Singer Swetha) ఈ ఫస్ట్ సింగల్ పాడారు. మెలోడీ సాంగ్(Melody Song) గా ఆడియెన్స్ ను, అభిమానులను అలరిస్తుందని ఆశించారు. ధనుష్ ఈ సాంగ్ కు సాహిత్యం అందించడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు మెలోడీ సాంగ్స్ లో దుమ్ములేపుతున్న జీవీ ప్రకాశ్, ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న ట్యూన్(Tune) ను వదలడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ధనుష్ నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాదికి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మరో మూడు చిత్రాలూ రాబోతున్నాయి. ఈ క్రమంలో నెక్ట్స్ ‘సార్’ చిత్రమే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 12న థియేటర్ల(Theaters)లో  గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ధనుష్‌, సంయుక్త మీనన్‌ (Samyuktha Menon) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.