జీవితంలో సంపూర్ణమైన ఆరోగ్యంతో నూరేళ్లు బ్రతకాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు.ఇందుకోసం ఎన్నోరకాల ఆరోగ్య సూత్రాలను పాటిస్తుంటాము.ఐతే మన జీవితంలో ఎప్పుడో ఒక్కసారి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

ఎందుకంటే ఇప్పుడున్న కలుషిత వాతావరణం,కలుషిత ఆహారం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

అందుకే మనం ప్రతిరోజు కొన్నిఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలా వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మన ఆరోగ్యం కోసం మనమే ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలి .

అయితే ఆ ఆరోగ్య సూత్రాలు ఏమిటో చూసేద్దామా ??

రోజు ని ఆనందంగా ప్రారంభించడం (Welcoming your day in happy mood).

1) ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు త్రాగాలి.

Hot water

మరియు మంచినీరు రోజుకి కనీసం రెండు నుండి మూడు లీటర్లు తాగాలి. అంతేకాకండా భోజనానికి 45 నిమిషాల ముందు నీళ్లు తాగితే మంచిది.

2) మన అల్పహారం సూర్యోదయం అయిపోయిన రెండు గంటలకల్లా(7 .30 -8 :30)సమయంలోపు తినాలి. అదేవిధంగా టిఫిన్ తోపాటు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ (Fruit Juice) తాగితే మంచిది.

Fruit juice

3) నిత్యం ఆహారంలో ఆకుకూరలు ,ఫ్రెష్ కూరలు ,ఫ్రూట్స్ (Fruits) తీసుకోవాలి.

మనం ఆహారాన్ని 32 సార్లు నమలాలి.ఏ సమయంలో ఆహారం నిండుగా తినవచ్చుఅంటే మధ్యాహ్నం సమయంలో భోజనాన్ని నిండుగా తినవచ్చు.తర్వాత మజ్జిగగాని, లస్సికానీ తాగవచ్చు.

4) రాత్రి భోజనం మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి, లేదా పుల్కా తీసుకుంటే ఇంకా మంచిది.భోజనం తర్వాత పాలు తాగాలి.

5) పుల్లటి పదార్ధాలు మాత్రం రాత్రి సమయంలో తీసుకోకూడదు.మరియు చల్లటి శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ (Cool drinks), ఐస్ క్రీమ్స్ (ICe creams) వంటివి తీసుకోకపోవడమే మంచిది.

6) ఉదయం టిఫిన్ తర్వాత పని చేయడం వల్ల త్వరగా అరుగుతుంది.

మధ్యాహ్నం భోజనం తర్వాత కొంచెంసేపయినా విశ్రాంతి తీసుకోవాలి.

రాత్రి భోజనం తర్వాత వెంటనే పడుకోకుండా 500 అడుగులు అయినా నడవాలి.

రాత్రి 9 -10 లోపే పడుకోవడం మంచింది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి 

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.అది ఎలా ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం అవుతుందో చూద్దాం.

ఆహారంలో  పోషకాలు ఎక్కువగా ఉండాలి మరియు కేలరీలు తక్కువగా ఉండాలి.అధిక మొత్తంలో ప్రోటీన్ ఉండాలి. కొలస్ట్రాల్ (Cholesterol) తక్కువుగా ఉండాలి.

సూక్ష్మ పోషకాలు విటమిన్స్,మినరల్స్ అధిక స్థాయిలో ఉండాలి.

పీచు పదార్ధం ఉండాలి సులభంగా జీర్ణం అవ్వాలి.

అన్నిటికి మించి అధిక మొత్తంలో యాంటీఆక్సిడాంట్లు ఉండాలి.

ముందు టైం టూ టైం భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి,మార్చుకోవాలి.

పాలు,గ్రుడ్లు,ఆకుకూరలు వంటి వాటిలో ప్రొటీస్,ఫైబర్ ఎక్కువ ఉన్నపటికీ కొలస్ట్రాల్ (Cholesterol) కూడా ఉంటుంది.

కాబట్టి ఉదయాన్నే మొలకెత్తిన గింజలు తినడం మంచిది.

దీనిలో ఎటువంటి  ఫ్యాట్ ఉండదు మరియు అన్ని పోషకాలు ఉంటాయి.

ఆరోగ్యకరమైన మానవుని లక్షణాలు

*శరీర పనితీరు చక్కగా ఉంటుంది.

*శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.

* అధిక బరువు ఉండకుండా చూసుకోవాలి.

*అరుగుదల చక్కగా ఉంటుంది.మలబాధకం ఉండదు.

*ఆరోగ్యంతో ఉండేవారి గుండె మరియు నాడులు లయబద్దంగా కొట్టుకుంటాయి.

*శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది.

*మూత్ర విసర్జనలో మరియు మల విసర్జనలోఎటువంటి సమస్యలు ఉండవు.

అంగట్లో అన్ని ఉన్న అల్లుడినోట్లో శని అన్నట్లు , మనం ఎంత సంపాదించినా,ఎంత పరపతి ఉన్న ఆరోగ్యం లేకపోతె ఎన్ని ఉన్నా,లేకపోయినా ఒకటే.

అందుకని మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త వహించాలి. మన ఆరోగ్యం మెరుగుపరచుకోవాలన్నా, పాడుచేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది.

అందుకే మన పెద్దలు ఎప్పుడు అంటుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని .

సంతోషం

ఎప్పుడు ఏదో ఒక వర్క్, ఉద్యోగం లేదా ఇంటి పనులు ఇలా మనుషులుఎదోకవిధంగా బిజీగా ఉంటున్నారు.దాని వల్ల మానసిక క్షోభకు గురవుతున్నారు.దానికి కేవలం విరుగుడు సంతోషమే.

సంతోషంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుంది.

అందుకే మనసుని ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం అనేది ఒక అలవాటుగా చేసుకోవడం చాలా మంచిది. ఇలా నిత్య వ్యాయామాలు,మంచి ఆహారపు అలవాట్లతో శరీర బి ఎం ఐ అనేది సరిగ్గా ఉండడమే కాకుండా ,భవిష్యత్తులో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ వేయొచ్చు .

పిల్లలకి కూడా నేర్పించాలి

Children habits

పిల్లలకి కూడా చిన్నప్పటి నుండి వ్యాయామం అలవాటు చేయడం ,ఏది తింటే ఎలా ఉంటుందో ఒక అవగాహన కల్పించాలి ,దానితో పిల్లలు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండడమే కాకుండా , మంచి ఆరోగ్యం గా ఉంటారు.

మంచి ఆహారపు అలవాట్లు తో అన్ని వైరస్ లు దూరం

ఈ ప్రపంచంలో ఎన్నో అద్బుతమైన వస్తులు,సాధనాలు ఉన్నాయి.నాకు తెలిసి మనిషికి మించిన అద్భుతమైన సాధనం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు.

అద్బుతమైన వస్తులు డబ్బులిచ్చి కొనుకోవచ్చు లేదా పాడైతే మరొకటి కొనుకోవచ్చు .కానీ మన అశ్రద్ధ వల్ల శరీరం పాడైతే ఒక్కోసారి ఎంత డబ్బుపెట్టిన మన శరీరాన్ని రక్షించుకోలేము.

కాబట్టి ముందుగా జాగ్రత్తపడుదాం మనల్నిమనమే కాపాడుకుందాం.

ఇప్పుడున్న రోజుల్లో కరోనా వైరస్ వల్ల ఇంకా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి.

అందుకే మంచి ఆహారపు అలవాట్లు తోపాటు వ్యాధిరిరోధక శక్తిని పెంచుకోవడం చాలా చాలా ముఖ్యం.

మన శరీరంలో తగినంత విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి.

Wear mask

మాస్క్ తో పాటు,ఎప్పటికప్పుడు చేతులని శుభ్రం చేసుకోవాలి.ఇవన్నీ పాటిస్తే  ఏ వైరస్ దరి చేరదు .

ఆరోగ్యం గా ఉందాం , మన కుంటుంబం తో ఆనందం గా ఉందాం .