భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ (BPCL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసారు. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ(Company)లో అనేక  పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.? అర్హులు ఎవ‌రు.? లాంటి పూర్తి వివ‌రాలు ఇక్కడ చూద్దాం!

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

నోటిఫికేష‌న్‌లో భాగంగా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(Junior Executive) (ఏవియేషన్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్‌ డిప్లొమా(Engineering Diploma)/గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(Graduate Degree)/ బీటెక్‌(B.Tech)/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం(Experience) ఉండాలి. అభ్యర్థుల వ‌య‌సు 01-02-2022 నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్యమైన విష‌యాలు..

  • ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్(Online) విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థుల‌ను అప్లికేషన్‌ స్క్రీనింగ్‌(Application Screening), రాత పరీక్ష(Written Test)/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(CBT), కేస్‌ బేస్డ్‌ డిస్కషన్‌(Case Based Discussion), గ్రూప్‌ టాస్క్‌(Group Task), పర్సనల్‌ ఇంటర్వ్యూ(PI) ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థుల‌కు నెల(Salary)కు రూ.30,000 నుంచి రూ.1,20,000 వ‌ర‌కు చెల్లిస్తారు.
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 07-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణయించారు.

పని అనుభవం: ట్యాంక్ ఫార్మ్ కార్యకలాపాలలో (రసీదు, నిల్వ మరియు నిర్వహణ) మరియు భారతీయ విమానాశ్రయాల ఏవియేషన్ ఫ్యూయలింగ్ సదుపాయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) యొక్క ప్లేన్ డెలివరీలో కనీసం 10 సంవత్సరాల నిరంతర సంబంధిత పని-అనుభవం, కనీసం 1 సంవత్సరం ట్యాంక్ ఫార్మ్ ఆపరేషన్స్(Tank Form Operations) మరియు ఇన్‌టు ప్లేన్ సర్వీస్‌(Into Plane Service)లలో  అనుభవం కలిగి ఉండాలి.

ఐఐటీ ఖరాగపూర్ లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ రిలీజ్ చేసారు. ఖ‌ర‌గ్‌పూర్‌(Kharagpur)లోని క్యాంప‌స్‌(Campus)లో నాన్ టీచింగ్(Non Teaching) పోస్టుల‌ను కాంట్రాక్ట్(Contract) విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

  • నోటిఫికేష‌న్‌(Notification)లో భాగంగా మొత్తం 08 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
  • వీటిలో మెడిక‌ల్ ఆఫీస‌ర్(Medical Officer) (03), అసిస్టెంట్ రిజిస్ట్రార్(Assistant Register) (02), అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్(Administration Officer) (03) ఖాళీలు ఉన్నాయి.
  • మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌(MBBS) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల(Candidates) వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ(Masters Degree)/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
  • అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్యమైన విష‌యాలు..

  • ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్(Online)/ఆఫ్‌లైన్‌(Offline) విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ముందుగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోని ఆ త‌ర్వాత హార్డ్ కాపీల‌(Hard Copy)ను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
  • మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ.56,100 – 1,77,500, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెలకి రూ.56,100 – 1,77,500, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ పోస్టుల‌కు నెలకి రూ.56,100 – 1,77,500 జీతం(Salary)గా చెల్లిస్తారు.
  • అభ్యర్థుల‌(Candidates)ను షార్ట్‌లిస్టింగ్‌(Short List), ఇంటర్వ్యూ(Interview) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 30-01-2022, హార్డ్ కాపీల‌ను పంప‌డానికి 07-02-2022ని ఆఖరి తేదీ(Last date)గా నిర్ణయించారు.
  • హార్డ్ కాపీ(Hard copy)ల‌ను ది డిప్యూటీ రిజిస్ట్రార్‌(The Deputy Register), ఐఐటీ ఖరగ్‌పూర్ – 721302 చిరునామా(Address)కు పంపించాలి.