ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) మరియు రష్మిక మందన్నలు జంటగా నటించిన చిత్రం ‘పుష్ప'(Pushpa). ఈ మూవీలో నటి సమంత(Samantha) చేసిన స్పెషల్ సాంగ్(Special Song)  ‘ఊ అంటావా’  ఊ,ఊ అంటావాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మ్యూజిక్ మాస్ట్రో(Music Maestro)  దేవి శ్రీ ప్రసాద్(DSP) స్వరపరచిన మరియు ఇంద్రావతి చౌహాన్(Indravati Chauhan) పాడిన ఈ సాంగ్ సమంతా కెరీర్‌(career)లో మొదటి స్పెషల్ సాంగ్‌గా నిలిచింది.

ఈ పాట ఇన్‌స్టంట్(Instant) హిట్‌గా మారడంతో అభిమానులు(Fans) సమంతను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  సుమారు రెండు వారాల క్రితం విడుదల చేసిన ఈ పాట ఫుల్‌ వీడియో(Full Video) 73 మిలియన్ల వ్యూస్‌(73 Million Views) సొంతం చేసుకుంది.

‘ఊ అంటావా’ అంటూ మ్యూజిక్ లవర్స్ (Music Lovers) సమంత సిజ్లింగ్(Sizzling) మరియు కిల్లర్ డ్యాన్స్(Killer Dance) కదలికలు చూసి ఫిదా అవుతుంటే, సమంత తాజాగా మరో ఐటమ్ సాంగ్ కి  గ్రీన్ సిగ్నల్(green Signal) ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు.. స్టార్ హీరోయిన్ సమంతకు మరో క్రేజీ ఆఫర్(Crazy Offer) వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

సెన్సేషనల్ డైరెక్టర్(Sensational Director) పూరీ జగన్నాథ్, రౌడీ హీరో(Rowdy hero) విజయ్ దేవరకొండ కాంబినేషన్లో(Combinations) రూపొందుతోన్న ‘లైగర్'(Liger) సినిమాలో ఐటెం సాంగ్ కు సామ్ ను సంప్రదించారని టాలీవుడ్(Tollywood) లో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండతో ఉన్న పరిచయం కారణంగా ఆమె ఈ స్పెషల్ సాంగ్ లో నటించేందుకు ఓకే(OK) చెప్పినట్లు తెలుస్తోంది.

కిక్‌ బాక్సింగ్‌(Kick Boxing) నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌(Action Entertainer)లో ఓ ప్రత్యేక పాట(Special Song) ఉందట. ఆ పాట కోసం ఎవరైనా స్టార్‌ హీరోయిన్‌ను సెలెక్ట్(Select) చేసుకోవాలని పూరి  జగన్నాథ్‌, ఆయన టీమ్‌ అనుకున్నారట. ఇదే సమయంలో ‘ఊ అంటావా'(OO Antaavaa) పాట సూపర్‌హిట్‌ కావడంతో  తమ చిత్రం లోనూ ఐటమ్‌ సాంగ్ కు సమంతను ఎంచుకుంటే బాగుంటుందని తెలుస్తోంది.

అంతేకాదు ఇప్పటికే చిత్రబృందం(Movie Unit) సామ్‌తో సంప్రదింపులు(Discussion) జరపడం, విజయ్‌ దేవరకొండ కూడా తనకున్న చనువుతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌(Talk) వినిపిస్తోంది.

మరి విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్ రిక్వెస్ట్(Request) కు సమంతం ఓకే చెప్పిందా? లేదా? తెలియాలంటే అధికారికం(Official)గా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.’మహానటి'(Mahanati) సినిమాలో సమంత- విజయ్‌ దేవరకొండ కలిసి పని చేసిన సంగతి తెలిసిందే.