హీరో(Hero) నందమూరి కళ్యాణ్‌ రామ్(Nandamuri Kalyan Ram) బింబిసార(Bimbisara) మూవీ తరువాత రూపొందుతున్న మూవీ అమిగోస్(Amigos). నిజానికి అమిగోస్ అనే పదం సాప్నిష్ పదం. అమిగోస్ అంటే ఒకే పోలికతో వున్న వాళ్ళు ఫ్రెండ్స్ అయితే అమిగోస్ అంటారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10(February 10th)న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఇప్పటికే  మైత్రి మూవీస్ ప్రమోషన్స్‌(Promotions) పెంచేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్(Viral) అవుతోంది. ఈ ట్రైలర్‌లో కళ్యాణ్‌ రామ్ మూడు పాత్రలతో విధ్వంసం చేసినట్టుగా అనిపిస్తోంది. విలన్‌గా, డాన్‌(Don)గా కళ్యాణ్‌ రామ్ పోషించిన పాత్ర మాత్రం సినిమాకు హైలెట్ అయ్యేట్టు కనిపిస్తోంది.

ఈ ట్రైలర్‌(Trailer)లో ఎన్నో సీన్లు, షాట్స్, డైలాగ్స్ హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఎంత మందిలో ఉన్నా నిన్ను ఇట్టే కనిపెట్టేస్తాను అని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌తో కళ్యాణ్ రామ్ డబుల్, త్రిబుల్ యాక్షన్ సీన్లు వస్తాయి. ఇక రొమాంటిక్ సీన్లు, సాంగ్‌ కూడా హైలెట్ అవుతుంది. ఎన్నో రాత్రులొస్తాయ్ అనే సాంగ్ స్పెషల్(Special Song) అట్రాక్షన్(Attraction) అయ్యేలా ఉంది.

అన్నింటి కంటే ముఖ్యంగా విలన్‌(Vilan)గా కళ్యాణ్‌ రామ్ నటించిన తీరు, చెప్పిన డైలాగ్స్(Dailogues) అదిరిపోయాయి. మనం ఫ్రెండ్స్ కాదు అన్నదమ్ములం అంత కంటే కాదు జస్ట్ మనం ఒకలా కనిపిస్తున్నాం అంతే, అంటూ చెప్పే డైలాగ్స్ నేను ఎవ్వరినీ బెదిరించను చంపేస్తాను అంతే. అంటూ అందరినీ చంపుకుంటూ పోయే సీన్లు గూజ్‌బంప్స్(Goose Bumps) తెప్పించేలా ఉన్నాయి. మరి కళ్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం(Three Roles) ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. జిబ్రాన్ కొట్టిన ఆర్ఆర్ ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఫిబ్రవరి 10న కళ్యాణ్‌ రామ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలానే ఉంది. అసలే ఇప్పుడు బింబిసార సక్సెస్‌(Success)లో కళ్యాణ్‌ రామ్ ఊపుమీదున్నాడు. బింబిసార‌తో బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గర సత్తా చాటిన క‌ళ్యాణ్ రామ్‌, అమిగోస్ తో మరోసారి సక్సెస్ చూడాలని ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ద్వారా కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్‌(Heroine)గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాశ్ తదితరులు నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌(Mytri Movie Makers Banner)పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.