మనలో చాలా మందికి ఉదయాన్నే లేచి వ్యాయామం చేసి తీరిగ్గా పేపరు చదివి కార్యాలయానికి వెళ్ళాలని వుంటుంది. అందుకోసం ఉదయాన్నే అలారం కూడా పెట్టుకుంటాం. ఇంత వరకూ బాగానే వుంటుంది. తీరా అది మోగేసరికి దాని నోరు నొక్కి అటు తిరిగి పడుకుంటాం. ఇది మనందరికీ అలవాటే. ఇప్పుడిక అలా జరగడానికి అవకాశం ఇవ్వవు ఈ గడియారాలు. ఇవి మనల్ని వినూత్నమైన పద్ధతుల్లో నిద్ర లేపడానికి సిద్ధంగా వున్నాయి. అవేంటో చూద్దాం రండి.

1. CLOCKY: ఈ గడియారం మోగినప్పుడు కానీ స్నూజ్ (snooze) చేసామా, ఇక అంతే. దానంతట అది ఎగిరి కింద పడి, పెద్ద చప్పుడు చేస్తూ ఇల్లంతా తిరుగుతుంది. ఇప్పుడిక దీనిని వెతికి పట్టుకొనేసరికి మన నిద్ర మత్తు ఎగిరిపోతుంది. దీని బాటరీ ఏడాది వరకు పని చేస్తుంది. దీని ధర $39.

clocky

2. లాక్ ఎన్ లోడ్: దీనిలో వీడియో గేమ్స్ మాదిరి గన్ కూడా వుంది. అలారం మోగినప్పుడు షూట్ చేయాల్సిన టార్గెట్ బైటికి వస్తుంది. దానిని ఆ గన్ తో ఎయిమ్ చేసి కొట్టాలి. రోజును ఉత్సాహంగా మొదలు పెట్టడానికి ఇది ఒక మంచి పద్ధతి కదూ.

gun

3. ఫ్లయింగ్ అలారం: ఈ గడియారంలో అలారం పెట్టుకున్న సమయానికి దీని పైన వుండే ప్రోపెల్లెర్ (బొంగరం లాంటి వస్తువు) శబ్దం చేస్తూ ఎగిరి పడుతుంది. ఇక మళ్ళి దానిని వెతికి తెచ్చి ఆ గడియారంలో పెడితేనే శబ్దం ఆగుతుంది.

flyingalarm

4. వర్కౌట్ అలారం: వ్యాయామ ప్రియుల కోసం దీనిని తయారు చేసారు. ఇది డంబెల్ ఆకారం లో వుండే గడియారం. ఇది మోగిన తరువాత ఆపాలంటే 30 బైసెప్స్ చేయాల్సిందే. దీనిలో వుండే మోషన్ సెన్సర్ ఎన్ని చేస్తామో లెక్క కడుతుంది. అన్నీ సరిగ్గా చేస్తేనే, దీనిలోని అలారం ఆగుతుంది.

workout

5. సోనిక్ బాంబు అలారం: ఎంత శబ్దానికి అయినా పట్టించుకోని వారికి ఇది చక్కని పరిష్కారం. ఇది 113 డేసిబెల్ శబ్దం తో మోగుతుంది. అంతటి శబ్దాన్ని చెవి తట్టుకోలేదు. పైగా దీనికి మంచాన్ని కుదపగల మరో సామర్ధ్యం కూడా వుంది. ఈ రెండిటి వల్ల ఇక మళ్ళి నిద్ర అన్న సమస్యే లేదు.

sonic bomb

6. సెన్సర్ వేక్: ఇది ఇంకా ఆసక్తికరమైన గడియారం. ఇది నిర్ణీత సమయానికి మనకు నచ్చిన వాసనతో మనను నిద్ర లేపుతుంది. ఉదాహరణకు కాఫీ, చాక్లెట్ మొదలైనవి.

sensorwake

బావున్నాయి కదూ ఈ కొత్త గడియారాలు. వీటితో రోజును మనకు నచ్చిన విధంగా మొదలుపెట్టవచ్చు.

courtesy