యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) విభిన్నమైన జోనర్‌‌లలో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో స్వీయ దర్శకత్వంలో హీరోగా తనను తాను ఆవిష్కరించుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మరోసారి స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) అనే సినిమాతో వస్తున్నారు.

ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ సినిమా విడుదలవుతోంది.

ఇప్పటికే ఒక్క మూవీ విడుదలకు రెడీ అవుతుంటే మరో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు విశ్వక్ సేన్. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌(SRT Entertainments Banner)లో తన 10వ సినిమాను చేస్తోన్న విశ్వక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడు(Director) రవితేజ ముళ్లపూడి(Ravi Teja Mullapudi)ని పరిచయం చేస్తున్నారు. రామ్ తాళ్లూరి(Ram Talluri) ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

ఈ సినిమాను ప్రస్తుతానికి vs10(VS10)గా టైటిల్ ఉంచారు . ఈ మేరకు ఒక పోస్టర్‌(Poster)ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్ర కార్యక్రమానికి పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ సినిమాను ఈరోజు ఘనంగా ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్‌ తాళ్లూరి భార్య రజనీ క్లాప్‌ ఇవ్వగా రచయిత, దర్శకుడు మచ్చ రవి (Macha Ravi) కెమెరా స్విచాన్‌(Camera Switchon) చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు దర్శకుడికి నిర్మాత రామ్ తాళ్లూరి స్క్రిప్ట్‌ ను అందజేశారు.

కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందనున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్(Vishwak Sen) సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కథానాయికగా నటిస్తుంది. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ రామ్ తాళ్లూరి నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఇది నా పదో చిత్రం. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్(Comedy, Action Entertainer). ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. కొత్త దర్శకుడు రవితేజ చాలా టాలెంటెడ్’ అని చెప్పారు.

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ రామ్ తాళ్లూరి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. విశ్వక్ సేన్‌తో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ సినిమాతో అది కుదిరింది. చాలా మంచి స్క్రిప్ట్. చాలా మంచి పాత్ర. ఇంత మంచి టీంతో కలసి పని చేయబోతుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’ అని అన్నారు.నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ విశ్వక్ సేన్ నాకు ఇష్టమైన హీరో.

ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఏడాది క్రితం రవితేజ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. విశ్వక్ ఈ కథను ఓకే చేసిన తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది. ఈ సినిమా ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఉంటుంది’ అన్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్(Bijoye) సంగీతం(Music) సమకూరుస్తుండగా మనోజ్ కటసాని(Manoj Katasani) కెమెరామేన్‌(Cameraman)గా పనిచేస్తున్నారు.

అన్వర్ అలీ(Anwar Ali) ఎడిటర్(Editor). క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.