బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas), రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) జంటగా నటించిన జయ జానకి నాయక(Jaya Janakai Nayaka) మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

యూట్యూబ్ లో  స్ట్రీమ్ అవుతున్న ఈ  మూవీ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 700 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అదేంటి ఈ చిత్రం అప్పుడెప్పుడో 2017 లో విడుదల అయితే , మరి ఇప్పుడెప్పుడలా ఈ సినిమాకు ఇంత ప్లస్ పాయింట్ అయింది అనే ఆలోచన వస్తుంది కదా.

ఎందుకంటే జయ జానకి నాయక మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఈ రెంజులో హిట్ కావడానికి బోలెడు కారణాలు ఉండొచ్చు. ఏదేమైనా ఈ సక్సెస్ ని  చూసి జయ జానకి నాయక మూవీ యూనిట్ కూడా  ఆశ్చర్యపోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన జయ జానకి నాయక మూవీ తెలుగులో నిర్మాతలకి నిరుత్సాహాన్నే మిగిల్చినప్పటికీ ఈ సినిమా హిందీ వెర్షన్‌కి మాత్రం హిందీ ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్(Huge Response) లభిస్తోంది. దింతో జయ జానకి నాయక హిందీ డబ్బింగ్(Hindi Dubbing) వెర్షన్‌(Version)కి 700 మిలియన్స్(700 Million) కి పైగా వ్యూస్(Views) లభించాయి.

ఒకరకంగా హిందీ డబ్బింగ్ చిత్రాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కి భారీగా మార్కెట్ ఉంది. ఈ సినిమాకు వస్తున్న స్పందనే అందుకు నిలువెత్తు సాక్ష్యం. దీంతో ఇకపై బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే తెలుగు చిత్రాలకు కూడా హిందీ డబ్బింగ్ రైట్స్(Hind Dubbing Rights) భారీ మొత్తంలో పలికేందుకు మార్గం సుగుమమైంది.

అంతేకాదు ఒకవేళ భవిష్యత్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పాన్ ఇండియా సినిమాల్లో నటించినట్టయితే, ఇతర భాషల్లో మార్కెట్ మరీ ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఎక్కువ ఆధరణ లభించేందుకు జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ వెర్షన్ సక్సెస్ బాటలు వేసినట్టయింది.

పెన్ మూవీస్(Pen Movies) అనే చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమా హిందీ వెర్షన్‌ని నాలుగేళ్ల క్రితం యూట్యూబ్‌(Youtube)లో అప్‌లోడ్(upload) చేయగా.. ఈ సినిమాకు 710 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పరిస్థితి చూస్తుంటే ఈ కౌంట్ ఇంకా పెరిగేలా కనిపిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర(Key Role)లో నటించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌(Dwaraka Creations Banner)పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జయ జానకి నాయక మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్‌కి వస్తున్న భారీ రెస్పాన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.