ప్రముఖ బ్రాండ్ సోనీ (Sony) నుంచి బడ్జెట్ రేంజ్‌(Budget Range)లో నెక్‌బ్యాండ్ స్టైల్(Neckband Style) ఇయర్‌ఫోన్స్(Ear Phones) లాంచ్ అయ్యాయి.

Dolby Atmos సపోర్ట్‌(Support) తో Sony WI-C100 వైర్‌లెస్(Wireless) నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు సోనీ ప్రకటించింది..

సోనీ చౌకైన నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌ గా ఇది ఇండియన్ మార్కెట్లో(Indian Market)కి అడుగు పెట్టింది. ప్రస్తుతం ప్రత్యేక ఇంట్రడక్టరీ ధర(Introductory Price)తో అందుబాటులో ఉంది.25 గంటల బ్యాటరీ లైఫ్‌(Battery Life)తో ఈ మోడల్ వస్తోంది. వాటర్ రెసిస్టెంట్స్(Water Resistance) కూడా ఉంటుంది. Sony WI-C100 నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ స్పెసిఫికేషన్లు (Specifications), ఫీచర్లు(Features), ధర(Price) వివరాలు ఎలా వున్నాయంటే!

Sony WI-C100 ఇయర్‌ఫోన్స్ ధర, సేల్‌

సోనీ డబ్ల్యూఐ-సీ100 ఇయర్‌ఫోన్స్ సాధారణ ధర రూ.2,790 అయితే, ప్రస్తుతం ఇంట్రడక్టరీ ధర రూ.1,699కు సేల్‌కు ఉంది. దీంతో సోనీ నుంచి అందుబాటులో ఉన్న ఇయర్‌ఫోన్స్‌ లో ఇదే చౌకైనది(Cheapest)గా నిలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌(Flip kart) సహా కొన్ని ఈ-కామర్స్ సైట్లు(E-Commerce), సోనీ ఆన్‌లైన్(Sony Online), రిటైల్ స్టోర్స్(Retail Stores), మల్టీ బ్రాండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్స్‌ (Multi Brand Electronics Stores)లో Sony WI-C100 మోడల్ అమ్మకాలకు  వచ్చింది.

Sony WI-C100 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

9mm డైనమిక్(Dynamic) సౌండ్ డ్రైవర్స్‌ (Sound drivers)తో సోనీ డబ్ల్యూఐ-సీ100 వైర్‌లెస్‌ నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్(Frequency Response) రేంజ్ 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది. కనెక్టివిటీ(Connectivity) కోసం బ్లూటూత్ వెర్షన్ 5(Bluetooth Version 5)తో ఈ ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి. SBC, AAC బ్లూటూత్ కొడెక్స్‌( Bluetooth Kodaks) కు మద్దతు చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే Sony WI-C100 ఇయర్‌ఫోన్స్ 25 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి.

చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్(USB Type C- Port) ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీఎక్స్4 రేటింగ్‌తో ఈ ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి. సోనీ సొంత 360 ఆడియో, గూగుల్ ఫాస్ట్ పెయిర్‌ (Google Fast Pair)కు ఈ ఇయర్‌ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌లో సోనీ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ (Sony Headphones Connect) యాప్‌ తో ఈ ఇయర్‌ఫోన్స్‌ ను సింక్ చేసుకోవచ్చు, అలాగే కూడా సెట్టింగ్ మార్చుకోవచ్చు.

సోనీ Sony WI-C100 ఇయర్‌ఫోన్స్‌కు ఇన్‌లైన్ బటన్స్ కంట్రోల్స్(Inline Button Controls) ఉంటాయి. ప్లేబ్యాక్‌(Play Back)ను, వాల్యూమ్‌(Volume)ను వీటి ద్వారా కంట్రోల్ చేయవచ్చు. వాయిస్ అసిస్టెంట్(Voice Assistant) కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. పరిసరాల శబ్దాలు ఇబ్బంది కలిగించకుండా నిరోధించేందుకు పాసివ్ నాయిస్ ఐసోలేషన్(Passive Noise Isolation) ఫీచర్‌తో సోనీ డబ్ల్యూఐ-సీ100 వస్తోంది. కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్(ANC) ఉండదు.  అట్మోస్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే సోనీ బ్రావియా ఎక్స్ఆర్ టీవీ(Sony Bravia XR TV), సోనీ డబ్ల్యూఎల్ఏ-ఎన్7తోనే డాల్బీ అట్మోస్(Dolby Atmos) పని చేస్తుందని సోనీ వెల్లడించింది.