ప్రస్తుత కాలంలో అన్ని దేశాలూ ఉగ్రవాదంతో యుద్ధం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఇందుకోసం విజ్ఞ్యానం తో ఏ దేశానికా ఆ దేశం కొత్త కొత్త ఆయుధాలను, కొత్త సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని తయారు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్ వంటి అతి ముఖ్యమైన చోట్ల ఉగ్రవాదుల పన్నే పన్నాగాలను తిప్పి కొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడు పెద్ద పెద్ద మెషిన్లే కాదు ఒక చిన్న మొక్క అయిన పుదినా కూడా పాలు పంచుకుంటుంది అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. రండి మరి ఆ మొక్క ఏం చేస్తుందో చూద్దాం.

మొక్కలు అవి ఏం చేస్తాయి అని మనం అనుకుంటాం. కానీ పర్యావరణాన్నినిరంతరం కనిపెట్టడంలో వీటికి సాటి మరేదీ లేదు. ఎందుకంటే ఇవి భూమిలోని నీటిలోనూ, పర్యావరణ గాలితోనూ వీటికి అనుబంధం ఉండడమే ఇందుకు కారణం. సరిగ్గా దీనినే ఆధారం చేసుకుని MIT కి చెందిన Michael Strano, ప్రొ. కెమికల్ ఇంజనీరింగ్ నేతృత్వం లో కొంత మంది శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేసారు. వీరు ఒక పుదినా మొక్క ను కార్బన్ నానోట్యూబ్ లో ఉంచారు. మొక్క యొక్క Transpiration వల్ల ఈ కార్బన్ నానో ట్యూబ్ ఆధారిత నానో పార్టికల్స్ ఆ మొక్క ఆకులకు చేరుతాయి. దానితో అవి నిరంతరం ఒక ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ ను బయటకి పంపుతాయి. ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ కావడంతో అవి మన కంటికి కనిపించవు. వీటిని ఒక ప్రత్యేకమైన కెమెరా తో చూడాలి. భూమిలో ఏమైనా బాంబు లేదా ల్యాండ్ మైన్ ఉన్నట్టయితే, ఈ నానో పార్టికల్స్ ఆ బాంబులలో వాడే ప్రధానమైన విస్ఫోటక పదార్దాలైన nitroaromatics ను కనిపెట్టగలవు. అలా కనిపెట్టగానే అది పంపే ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ లో మార్పు కనిపిస్తుంది. సరే, మరి ఈ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ ఎలా కనిపిస్తుంది అంటే, ఒక $35 Raspberry Pi minicomputer ను ఈ ప్రయోగంలో ఉపయోగించారు. అయితే దీనికి బదులు మన స్మార్ట్ ఫోన్ లోని ఇన్ఫ్రారెడ్ ఫిల్టర్ తీసేస్తే అది కూడా ఈ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ ను గమనించేందుకు వాడవచ్చని ఈ శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన Strano అంటున్నారు. ఇందుకోసం ఈ ప్రయోగంలో nitroaromatic కాంపౌండ్ అయిన Picric acid ను కేవలం 10 నిముషాలలో నానో ట్యూబ్స్ లో ఉంచిన ఈ మొక్క కనిపెట్టేసింది. అలా ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ లోని మార్పు ద్వారా ఒక కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోనుకు నిరంతరం సమాచారం అందుతూనే ఉంటుంది.

ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొక్కను ఒక చిన్న కార్బన్ నానో tube లో పెట్టడం వల్ల ఈ నానో పార్టికల్స్, మొక్క వేరు నుంచి ఆకుకి చేరి అక్కడే ఉండి పోతాయి. అంటే ఈ నానో పార్టికల్స్ ద్వారానే ఈ మొక్క నిరంతరం ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ పంపిస్తుంటుంది. అంతే కాదు, ఇవి నానో పార్టికల్స్ కావడం చేత అతి తక్కువ పరిమాణంలో విస్ఫోటక పదార్ధాలను సైతం కనిపెట్టేస్తుంది. భూమిలో పాతి పెట్టబడిన బాంబు లు ల్యాండ్ మైన్ లను ఈ విధంగా కనిపెట్టగలదు. అయితే ప్రస్తుతం ఈ బయోనిక్ ప్లాంట్ దానికి ఒక మీటర్ పరిధిలో మాత్రమే విస్ఫోటకాలను గుర్తించగలదు. అందువల్ల శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ పరిధిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ పరిశోధన Nature Materials అనే జర్నల్ లో అక్టోబర్ 31 న ప్రచురించబడింది. ఇది ఆచరణలోకి వస్తే ఇది వ్యవసాయానికి, పర్వావరణ పర్యవేక్షణకు, డిఫెన్స్ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక పెద్ద పెద్ద పరికరాలకు బదులు మొక్కలు వినియోగించడం వల్ల ఖర్చు కూడా ఎంతో తగ్గుతుంది అని వేరే చెప్పనవసరం లేదు కదూ.

Courtesy