సీతాఫల్ బాసుంది(Seethaphal Basundi), పేరు వినగానే అర్థమైపోతుంది స్వీట్గు రెసిపీ(Sweet Recipe) అని.

ఈ రెసిపీని మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటకలలో ఎక్కువగా చేసుకునే భారతీయ స్వీట్(Indian Sweet).

ఇది వరకు తక్కువ మంట మీద పాలు సగానికి వచ్చే వరకు మరిగించడం  ద్వారా తయారు చేయబడిన తియ్యని కండెన్స్డ్ పాలు(Codensed Milk). ఉత్తర భారతదేశం(North India)లో, ఇదే విధమైన వంటకం రబ్రీ(Rabri) పేరుతో తయారు చేస్తారు. సీతాఫలం దాసుంది ఇది చాలా రుచికరమైన(Tasty), అతి తక్కువ సమయం తో తయారు చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. ఈ సీతాఫలాన్ని శీతాకాలం(Winter)లో పొందవచ్చు, కాబట్టి మీరు ఈ బాసుంది స్వీట్ రెసిపీని ట్రై చేయండి.

 కావాల్సిన పదార్దాలు

పాలు  1 లీటర్

గింజలు తీసిన సీతపండ్ల గుజ్జు

డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కి కావాల్సినంత

సీతాఫల్ బాసుందిని ఎలా తయారు చేయాలి

పాన్‌లో 1 లీటర్ పాలు పోయాలి. ఉడకబెట్టి, తక్కువ మంట మీద పాలను చిక్కబడే వరకు  మరిగించండి. తాజా సితాఫాల్ నుండి గుజ్జును తీసివేసి, ఆ గుజ్జును చల్లారిన పాలలో వేసి బాగా కలపాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేస్తే మీ సీతాఫల్ బాసుండి రెడీ. వీటిని వేడి గా సర్వ్ చేయచ్చు లేదా  కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేయండి .

న్యూట్రిషనల్ ఫాక్ట్స్:

సీతాఫలంలో పోషక విలువలు(Nutritional Facts) అధికం. కస్టర్డ్ యాపిల్(Custard Apple) అని పిలిచే సీతాఫలంలో ఐరన్(Iron), పాస్ఫరస్(Phosphorus), మెగ్రీషియం(Magnesium) లతోపాటు విటమిన్-సి(Viatmin C) సమృద్ధిగా లభిస్తాయి. వంద గ్రాముల సీతాఫలంలో 68.6 గ్రాముల తేమ, 1.6 గ్రాముల కొవ్వు, 26.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు(Carbhohydrates), 2.4 గ్రాముల పీచు పదార్థాలు(Fiber) ఉంటాయి. కాల్షియం(Calcium), థయమిన్(Thamine), రైబోఫ్లోవిన్(Ribo plavolin), నియాసిన్(Niacine) కూడా ఇందులో ఉంటాయి.