మహిళల్లో నెలసరి చిక్కులు తప్పించుకోలేనివి. ఓ వైపు నెలనెలా రుతుస్రావం(Periods) మరోవైపు జననావయవా ప్రాంతంలో శుభ్రత పాటించకపోవడం వల్ల చాల మంది మహిళల్లో ఇన్ఫెక్షన్లు(Infections) కనిపిస్తుంటాయి.

దురద(Itching), మంటల(Inflammation)తో మొదలయ్యే ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే మెల్లగా పెల్విక్ ఇన్ఫలమ్మటరీ డిసీజ్(Pelvic Inflammatory Disease) కు అనే జబ్బుకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

మర్మావయావా భాగంలో తీవ్రమైన దురదల్ని, అసౌకర్యాన్ని తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లకు ఆయుర్వేదం(Ayurvedam) లో వున్నా చికిత్సలు(Treatment), పరిష్కార మార్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం!

మనం కొన్ని రకాల అనారోగ్య సమస్యలన్నీ బయటకు చెప్పుకోలేము. అసలు ఆ సమస్యకు ఎవరిని కలవాలో? ఏ డాక్టర్ని సంప్రదించాలో కూడా తెలీక ఆందోళన చెందుతుంటాం. మహిళల్లో జననాంగంలో కనిపించే ఇంఫెక్టుణాలు అలాంటివే. అప్పుడప్పుడు తెలుపు కావడం మహిళల్లో సాధారణమే. అయితే కొన్ని సార్లు బాక్టీరియా, వైరస్లు కారణంగా యోని భాగంలో ట్రైకోమోనాసిస్(Tricomenasis), కాండిడియాసిస్ (Candidacies), ఈస్ట్(Yeast) వంటి ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి.

ఈ ఇన్ఫెక్షన్ల కారణంగా యోని భాగంలో తరచూ మంట, దురదలు వేధిస్తుంటాయి. ఈ రకమైన ఇన్ఫెక్షన్లకు సరైన శుభ్రత(Clean) పాటించకపోవడం, లైంగిక సంబంధాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని కారణాలుగా చెబుతారు డాక్టర్లు. మహిళల్లో చాలా మంది అతి శుభ్రతను పాటిస్తుంటారు. యోని భాగాన్ని పదే పదే శుభ్రం చేసుకుంటూ వుంటారు. కొంత మంది యాంటీ సెప్టిక్ లోషన్(Anti septic Lotion) కూడా వాడుతుంటారు.

నిజానికి ఇలా చేయడం వల్ల యోని భాగంలో వుండే మేలు చేసే బాక్టీరియా తగ్గిపోతుంది. దింతో అక్కడ ఇన్ఫెక్షన్ల బెడద పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాల మందికి తెల్ల బట్ట కూడా చాలా మంది ఒక సమస్యగా ఉంటుంది. దీనికి సకాలంలో చికిత్స తీసుకోనప్పుడు వజైనల్ ఇన్ఫెక్షన్(Vaginal Infection) సోకె అవకాశం ఉంటుంది.

షుగర్ జబ్బు(Diabetes)తో బాధపడే వారికీ మిగతా వాళ్ళతో పోలిస్తే జనావయవా ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు సోకె ముప్పు అధికంగా ఉంటుంది. మల విసర్జన తరువాత  ముందు నుంచి వెనకకు కూండా, వెనక నుంచి ముందుకు శుభ్రం చేసుకునే అలవాటు వలన వైజనల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు.అలాగే సింథటిక్ అండర్ వెర్ ధరించే వారికీ చెమట(Sweat) ఎక్కువగా పట్టడం వల్ల యోని భాగంలో ఇన్ఫెక్షన్లు అధికంగా సోకుతుంటాయి.

జనాంగళ్ల ఇన్ఫెక్షన్లను నివారించుకోవడానికి వ్యక్తిగత శూరం పటించుకోవడం చాల కీలకం. వజైనల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నప్పుడు భార్యభర్తలు ఇద్దరు చికిత్స తీసుకోవడం మేలు.

ఇక బాక్ట్రయల్ ఇన్ఫెక్షన్స్(Bacterial Infections) ని తగ్గించడానికి పెరుగు బాగా ఉపయోగ పడుతుంది. అలాగే త్రిఫల చూర్ణం(Triphala), అశోక చూర్ణం(Asoka powder) లేదా అశోకపట్టా(Asokapatta) కషాయాన్ని రెండు పూతల తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే పసుపు(Turmeric), పొడిపత్రిని సమభాగాలుగా యష్టిమధు(Yashtimadhu) ని రెండు భాగాలుగా తీసుకుని మిశ్రమంగా చేసుకుని రోజుకు రెండు పూటలా తీసుకుంటే వైజనల్ ఇన్ఫెక్షన్ తీవ్రత బాగా తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా వున్నప్పుడు  అశోకారిష్ట(ASHOKARISHTA) సరిబాధాసవం, అశోకాది వాటి, లోధాశ్రవం,దశములారిష్ట, త్రివంగ శీలా ఔషధాన్ని(Medicine) కొంతకాలం పాటు నిపుణుల(Experts) పర్యవేక్షణలో వాడుకుంటే మంచిది.