ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాలను కలుపుతూ త్వరలో మరో వందే భారత్(Vande Bharath) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Super Fast Express) రైలు ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్ – విశాఖ(Secundrebad – Vizag) మధ్య తొలి వందే భారత్ రైలు ప్రారంభం కాగా, గత నెలలో సికింద్రాబాద్- తిరుపతి రైలు పట్టాలెక్కింది.

దీనిని స్వయంగా ప్రధాని(PM) నరేంద్రమోదీ(Narendra Modi) ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో తాజాగా మరో కొత్తరూట్(New Route) తెరపైకి వచ్చింది. ఒడిషా రాష్ట్ర(Odisha State) రాజధాని భువనేశ్వర్(Bhuvaneshwar) – హైదరాబాద్(Hyderabad) రూట్లో హైస్పీడ్ రైలు(High Speed Trains) కోసం ఆ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది.

ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి(Railway Minister) అశ్విని వైష్ణవక(Aswini Vaishnawaka) లేఖ రాసింది. ఒడిషా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో దశాబ్దాల క్రితమే లక్షలాది మంది తెలుగు ప్రజలు వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అలాగే ఒడిషా నుంచి చాలా మంది వలస వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

దీంతో రెండు రాష్ట్రాలలో స్థిరపడ్డ ప్రజల రవాణా సౌకర్యం(Transport Facility) నిమిత్తం రెండు రాష్ట్రాల రాజధాననులైన భువనేశ్వర్-హైదరాబాద్‌ను కలుపుతూ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నడపాలని ఆ రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

దీంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల(Passengers) రాకపోకలను వేగవంతం చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. భువనేశ్వర్-హైదరాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నడపటానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు.