తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy) రీసెంట్ గా వారసుడుతో బాక్స్ ఆఫీస్ వద్ద  మంచి హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో(LEO)’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్(Seven Screen Banners) పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. దీనితో ఈ మూవీ సంబంధించి క్రేజీ డిటేయిల్స్(Crazy Details) నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఖైదీ, విక్రమ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం(Direction)లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లియో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.400 కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది.

రిలీజ్ కు ముందే వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో మూవీ పై మరింత ఆసక్తి నెలకొంది. తమిళ ఇండస్ట్రీలో అత్యధిక ప్రీ రిలీజ్(Pre Release) బిజినెస్(Business) ను సాధించిన చిత్రంగా ఈసినిమా ఇప్పుడే రికార్డు క్రియేట్ చేస్తోంది.

అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్(Satellite), డిజిటల్(Digital), మ్యూజిక్(Music) అండ్ థియేట్రికల్(Theatrical) రైట్స్(Rights) విక్రయించగా ఈ భారీ మొత్తం వసూలైనట్టు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్(Netflix) రూ.120 కోట్లతో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ రూ.70 కోట్లు దక్కించుకుందని టాక్.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravichandran) అందిస్తున్న మ్యూజిక్(Music) ని సోనీ మ్యూజిక్(Sony Music) రూ.18 కోట్లకకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక హిందీ శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తంలోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండస్ట్రీ(లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబుడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లియో చిత్రం గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతోంది. దళపతి పవర్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుండం విశేషం. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష  (Trisha) నటిస్తోంది.

అలాగే సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా కాశ్మీర్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్.

2023 అక్టోబర్ 19(October 19th) న ప్రపంచ వ్యాప్తం (World Wide)గా విడుదల(Release) కాబోతోంది.