పారిశుధ్యం (Sanitation) యొక్క ఆవశ్యకత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పారిశుధ్యనికి మూలం మరుగు దొడ్లు (Toilet). కానీ WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది టాయిలెట్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నారు. పేదరికం దృష్ట్యా వీరి శాతం అధికంగా అభివృద్ధి చెందని దేశాల్లో ఎక్కువగా ఉంది. సరైన నీరు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పచ్చు. అటువంటి వారి జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేసి వారి కోసం ఒక కొత్త టాయిలెట్ ను రూపొందించారు UK లోని Cranefield University కి చెందిన పరిశోధకులు. ఒక అభివృద్ధి చెందిన దేశం ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపడం నిజంగా ఆసక్తికరం.
Cranefield University రూపొందిచిన ఈ టాయిలెట్ పేరు Nano membrane Toilet. ఇది నీరు ఇంకా ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండానే పని చేస్తుంది. ఈ ప్రక్రియలో దీని నుంచి ఎలాంటి దుర్గంధం రాకపోవడం ఒక ప్రత్యేకత. ఇంకా దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఒక బాటరీ ద్వారా పని చేస్తుంది. ఆ బాటరీ కి అనుసంధానం చేయబడిన పరికరానికి ఉన్న ఒక సైకిల్ చక్రం వంటిదాన్ని తిప్పితే సులువుగా ఛార్జ్ అవుతుంది. పైగా దీని నుంచి చివరగా శుద్ధి చేయబడిన నీరు, అలాగే మొక్కలకు ఎరువు కూడా లభిస్తాయి.
ఈ టాయిలెట్ వాడకాన్ని విస్తృత పరిచేందుకు దీనికి Bill and Melinda Gates Foundation వారి మద్దతు కూడా లభించింది. దీనిని మొట్టమొదటగా ఆఫ్రికా లోని ఘానా అనే దేశంలో దీనిని ఉపయోగించనున్నారు. అక్కడ ఇంటింటికీ దీనిని అందజేసి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే దీనిని తయారు చేసిన పరిశోధకుల లక్ష్యం. ఇది విజయవంతం అయితే ఈ Nano Membrane Toilet అన్ని బహిరంగ ప్రదేశాల్లో దీనిని వినియోగించనున్నారు.

Source