గతంలో మనం 3D ప్రింటర్ గూర్చి చెప్పుకున్నాం. ఈ 3d ప్రింటింగ్ అనే ప్రక్రియ అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కారణం కానుంది. అలాగే దీని వినియోగం ఎన్నో రంగాలకు విస్తరిస్తోంది. అందులో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడిసిన్, మనుఫాక్చరింగ్, టెక్స్టైల్స్ వంటి రంగాలు ఉన్నాయి. ఇక ఇది మనం తినే ఆహారానికీ విస్తరిస్తే. మనం మనుషులు వండిన ఆహారం కాక 3D ప్రింటెడ్ ఆహారాన్ని తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది ఎలా ఉంటుందో చూద్దామా.

Hod Lipson, కొలంబియా యూనివర్సిటీ లో ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ మరియు డిజిటల్ మనుఫాక్చరింగ్ లో roboticist గా పని చేస్తున్నారు. ఆయన తన విద్యార్ధులతో కలిసి ఒక ప్రాజెక్ట్ డిజైన్ లో భాగంగా 3D ఫుడ్ ప్రింటర్ ను తయారు చేసారు. Delft University of Technology, Netherlands కు చెందిన Drim Stokhuijzen మరియు State University of New York System’s (SUNY) Maritime College కు చెందిన Jerson Mezquita ల తో సంయుక్తంగా Lipson ఈ 3D ప్రింటర్ ను తయారు చేసారు.

ఇది చూడడానికి ఒక కాఫీ మెషిన్ లా ఉంటుంది. దీనిలో తిండి పదార్ధాలను వేయడానికి ఎనిమిది భాగాలు అలాగే 3D ప్రింట్ చేయడానికి ఒక రోబోటిక్ ఆర్మ్ ఉన్నాయి. ఇది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఇందులోని ఆహార పదార్ధాలను తినే ఆహారంగా తయారు చేస్తుంది. అయితే ఇది మన రోజూ వారీ వంటకు ప్రత్యామ్నయం కాదని ఈయన పేర్కొన్నారు. అప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను ఇది ప్రింట్ చేసి ఇవ్వగలదు. అంటే మనకు ఉదయం అల్పాహారానికి మనం బయట నుంచి కొన్న packed foods కంటే ఆరోగ్యకరమైన పదార్ధాలను అందులో వేస్తే చాలు అదే చూడడానికి అందంగా, రుచిగా కూడా ఉండే తిండి పదార్ధాలను తయారు చేసి ఇస్తుంది. ఇక దీని రూపకర్తలు దీనిలో ఇన్ఫ్రారెడ్ హీటింగ్ కూడా అమర్చాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా వేర్వేరు పదార్ధాలను వేర్వేరు ఉష్ణోగ్రతల దగ్గర ప్రింట్ అదే వండుతుంది. ఇది ఆహార పరిశ్రమలో అంటే రెస్టారెంట్ మరియు హోటళ్ళ లో దీని అవసరం ఉంటుంది అని చెప్పచ్చు. ఇక ఎప్పుడూ కొత్తదనం కోరుకునేవారు వారి వంటింట్లో కూడా ఓవెన్ మాదిరిగా దీనికి స్థానం కల్పించచ్చు.

3D ప్రింటింగ్ ద్వారా వంటలను రుచి చూడడమనేది ఒక వినూత్న ప్రక్రియేనని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఇది తోలి దశలో ఉన్నా ఆహార రంగాల్లో ఇది విప్లవాత్మకమైన మార్పులకే కారణమవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడక్కడ 3D ప్రింటెడ్ restaurant లు ప్రారంభమవుతున్నాయి. చూద్దాం మరి ఈ 3D printed ఆహారం ఎలా ఉంటుందో.

Courtesy