హీరో నాగ శౌర్య(Naga Shourya) నటించిన అశ్వత్థామ(Ashwadhama) మూవీకి డైలాగ్స్(Dialogues) అందించిన పరశురామ్ శ్రీనివాస్(Parasuram Srinivas) రీసెంట్ గా రణస్థలి(Ranasthali) అనే యాక్షన్ డ్రామా(Action Drama) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కర్ణాటకపు ధర్మ ప్రధాన పాత్ర(Main role)లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌(First Look Poster)ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagralamudi) ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురాం శ్రీనివాస్, కెమెరామెన్ జాస్తి బాలాజీ(Camera man Jasthi Balaji), ఎడిటర్ భువన్ చందర్(Editor Bhuvan Chander), నటీనటులు ధర్మ, ప్రశాంత్, శివ జామి, నాగేంద్ర, విజయ్ రాగం మరియు కెమెరా అసిస్టెంట్ సాయి, సహాయ దర్శకుడు మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ, ‘రణస్థలి సినిమా రఫ్ కట్ టీజర్(Teaser) చూస్తుంటే టైటిల్‌(Tittle)కు తగ్గట్టుగా సినిమా టీజర్ అద్భుతంగా ఉంది.

చిన్న సినిమాలో ఇలాంటి ఫైట్ సీక్వెన్స్(Fight Sequence) హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. పోస్ట్ ప్రొడక్షన్(Post Production) కార్యక్రమాలు వేగంగా పూర్తిచేసి.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకునే టీం తపన నాకు చాలా నచ్చింది. డైలాగ్స్ వింటుంటే కేజీఎఫ్(KGF) లెవెల్లో ఇంపాక్ట్(Impact) ఇస్తున్నాయి. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా టీం అందరికీ గొప్ప విజయం(Success) సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అని అన్నారు.

దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘మా రణస్థలి చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు క్రిష్ గారికి ధన్యవాదాలు. మేము క్రిష్ గారికి రఫ్ కట్ టీజర్ను చూపించడం జరిగింది. అది చూసి హర్షం వ్యక్తం చేశారు.యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు.

ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా అద్భుతంగా నటించారు. ప్రతి క్యారెక్టర్లో ఆర్టిస్టులు కనిపించరు. సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత వారి క్యారెక్టర్లు మీతోనే ఉంటాయి. ఈ సినిమా టీజర్(Teaser), ట్రైలర్(Trailer) బయటకు వచ్చిన తరువాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్(Response) వస్తుంది.

మా సినిమా చూసిన తరువాత ప్రేక్షకులకు చిన్న సినిమాపై వుండే చులకన భావం పోయేలా మా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. సంగీత దర్శకుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన సురెడ్డి విష్ణుకు ధన్యవాదాలు. రణస్థలి సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాము’ అని పేర్కొన్నారు.

నిర్మాత సురెడ్డి విష్ణు మాట్లాడుతూ, ‘వైవిధ్యమైన కాన్సెప్టు(Different Concept)తో రానున్న రణస్థలి చిత్రం ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి (Experience)ని అందిస్తుంది. ఈ సినిమాను టీం అంతా ఎంతో కష్టపడి పూర్తి చేశాము. నటీనటులు (Actors), టెక్నిషన్స్(Technicians) అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్(Support) చేశారు.

రణస్థలి సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి అనుభూతిని పొందుతారని ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఏజే ప్రొడక్షన్ బ్యానర్‌(AJ Production Banner)పై సుర్రెడి విష్ణు(Sureddy Vishun) రణస్థలిని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి కేశవ కిరణ్(Keshava Kiran) సంగీతం(Music) అందించారు. ఇందులో అమ్ము అభిరామి, చాందినీ రావు, అశోక్ సంగ కీలక పాత్రలు(Key role) పోషిస్తున్నారు.