మనం మన చుట్టూ ఎన్నో జంతువులను, కీటకాలను చూస్తుంటాం. వాటన్నిటిలో మన కంటికి కనిపించే అతి చిన్నవి చీమలు. అంత చిన్న చీమలు ఒక విషయంలో మాత్రం మనకు ఆదర్శంగా నిలుస్తాయి. అది ఐకమత్యంగా ఒక బృందo తో కలిసి పని చేయడం. అంత కంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అవన్నీ కలిసి తమకంటే పరిమాణంలో ఎంతో పెద్దవైన కీటకాలు, జంతువులను తమ ఆహారం కొరకు మోసుకు వెళ్తాయి. అది చూడడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుoది కదూ. అయితే ఇక్కడి తో సరిపెట్టుకోలేదు Stanford University లోని Biomimetics and Dexterous Manipulation Laboratory కి చెందిన పరిశోధకులు. వీరు ఆరు చిన్న చిన్న microbots (వీటి మొత్తం బరువు 100 గ్రాములు) చేత తమ కంటే 200 రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను లాగేట్టు చేసారు. ఇందుకోసం వీరు చీమల కాళ్ళకు ఉండే జిగురు వంటి పదార్ధాన్ని తయారు చేసి ఒక్కో microbot కు పూసి వీటన్నిటి చేత సమిష్టిగా ఒక 1800 kg లు బరువుండే కార్ ను డ్రైవర్ తో సహా లాగేలా చేసారు. ఇది నిజంగా అద్భుతం. ఎందుకంటే ఒక మనిషి చేసే పనిని చిన్న చిన్న రోబోట్ లు చేయగలగడం, అది కూడా సమిష్టిగా పని చేయడం అన్నది నిజంగా అద్భుతమే కదూ. ఇందుకు సంబంధించిన వీడియో ను మీరు పైన చూడవచ్చు.

ఇటువంటి ప్రయోగాలు, పరిశోధనలూ ఇప్పుడు ఆరంభ దశలో ఉన్నాయి. ఈ పరిశోధనలు మరింత వృద్ధి చెందితే ఏమో మనిషి సహాయం అవసరం లేకుండానే మనుషులను ఈ రోబోట్లు ఒక చోటు నుంచీ మరొక చోటుకు తీసుకు వెళ్తాయేమో చూద్దాం. ఏది ఏమైనా చీమల సామర్ధ్యాన్ని ఒక ల్యాబ్లో యధాతధంగా సృష్టించడం మాత్రం అద్భుతమనే చెప్పాలి.