Lishtottestdrop

Lishtottestdrop

ప్రాణికోటి మనుగడకు నీరు చాలా ముఖ్యం. అది కూడా మంచి నీరు అయ్యి ఉండాలి. మనం 20వ శతాబ్దoలో ప్రవేశించినా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి మంచి నీరు సదుపాయం లేదు. పోనీ ఆ సౌకర్యం ఉంది అని అనుకున్న ప్రాంతాల్లో కూడా మానవ చర్యల కారణంగా నీరు కలుషితం అయిపోతోంది. అందుకే చంద్రమండలం మీదకు వెళ్లి వస్తున్న ఈ రోజుల్లో కూడా నీటి శుద్ధత కోసం ప్రయత్నాలు, పరిశోధనలు జరుగుతున్నాయంటే సమస్య తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. సరే ఇదే వేదిక పై మనం గతంలో కూడా పలు రకాల నీటి శుద్ధి పరికరాల గురించి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయేది వాటన్నిటికంటే భిన్నమైనది, ప్రత్యేకమైనది. అదే Lishtot Testdrop. ఎందుకో, ఏమిటో చూద్దామా.

నీటి శుద్ధత అంటే దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద మాటలేల మన ఆరోగ్యానికి హాని కలిగించని విధంగా అందులో ఎలాంటి కలుషిత పదార్ధాలు లేకపోతే అది మంచి నీరవుతుంది, శుద్ధమైన నీరు అవుతుంది. అయితే మన ఇంట్లో మనం సరే ఫిల్టర్లు వగైరాలు అమర్చుకుంటాం. అదే బయటకు వెళ్ళినప్పుడు కొనే మినరల్ బాటిల్ నీరు శుద్ధమైనదేనా అనే అనుమానం రాక మానదు. అంతే కాదు ఇక పై బయట ప్రదేశాల్లో దొరికే నీటిని కూడా పరీక్షించవచ్చు. అందుకు తగ్గట్టుగా అతి తేలికైన, సులువైన, చవకైన పరికరం అందుబాటులోకి వచ్చేసింది అదే ఈ Lishtot Testdrop.

Lishtot test

Lishtot test

ఇది చూడడానికి నీటి బిందువు ఆకారంలో ఉండే పరికరం. దీనిలో ఒకే ఒక్క బటన్ ఉంటుంది. మీరు తాగాలి అనుకునే నీటిని ఒక గ్లాస్ లో పోసి ఈ పరికరoలోని బటన్ వత్తుతూ గ్లాస్/బాటిల్ కు తాకిస్తే చాలు, ఒక్క సెకనులో నీరు సురక్షితమైనది అయితే నీలం రంగు లైటు వెలుగుతుంది, కాకపోతే ఎరుపు రంగు లైటు వెలుగుతుంది. సరే ఇంత త్వరగా నీటిని ఎలా అంచనా వేసిందంటే, నీరు యొక్క electrical conductivity ఆధారంగా ఇది నీటి శుద్ధతను కనిపెట్టగలిగింది. నీటికే కాదు ప్రతీ వస్తువుకు దాని చుట్టూ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. అందువల్ల ఎలాంటి సెన్సర్లు, ఫిల్టర్లు, అవసరం లేకుండా ఇది పని చేస్తుంది. అంతే కాదు నీటిలో ఏదైనా కలుషిత పదార్ధాలు అంటే TDS, lead, chlorine మొదలైనవి ఎంత తక్కువ మోతాదులో ఉన్నా సరే ఇది కనిపెట్టగలదు.

ఈ Lishtot Testdrop పరికరo వివిధ రకాలైన కలుషిత పదార్ధాలు కలిసిన నీటితో చాలా మార్లు ఉపయోగించగా ఇది నూటికి నూరు శాతం శుద్ధమైన నీరును కనిపెట్టగలిగింది. ఇక ఈ పరికరం బాటరీ ఆధారంగా పని చేస్తుంది. దీని బాటరీ చాలా సంవత్సరాలు నిరంతరాయంగా పని చేస్తుంది. ఇక దీనికి అనుబంధంగా ఒక యాప్ ఉంది. అవసరం అనుకుంటే దానిని కూడా ఉపయోగించుకోవచ్చు, కాకపోతే ఈ యాప్ Paid services కలిగి ఉంటుంది.

ఈ పరికరం ధర $25-50 వరకు ఉంటుoది. ఈ పరికరాన్ని CES 2018లో విడుదల చేసారు.