ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌ (IBPS) రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (RRB) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌(CRP)-XI (సీఆర్‌పీ) ద్వారా ఆఫీస‌ర్లు(Officers), ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్పస్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

అర్హత(Qualified), ఆసక్తి(Interested)గల అభ్యర్థులు(Candidates) జూన్‌ 27 వరకు ఆన్‌లైన్‌(Online)లో అప్లయ్‌(Apply) చేసుకోవచ్చు.

పూర్తి వివరాల్లోకెళ్తే..

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 8106 పోస్టులు

పోస్టులు: ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లు (మల్టీపర్పస్‌)

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ(Degree), సీఏ(CA), ఎంబీఏ(MBA), లా(LAW) తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అధిక శాతం ఉద్యోగాలు డిగ్రీ అర్హతతో ఉన్నాయి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ONLINE TEST) (ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్‌), సూచించిన పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ ఆధారం(Interview based)గా ఎంపిక ప్రక్రియ(Selection Process) నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 07, 2022

ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేది: జూన్‌ 27, 2022

ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ (ప్రిలిమిన‌రీ): ఆగ‌స్టు 2022

ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ (మెయిన్‌): సెప్టెంబ‌రు/ అక్టోబ‌రు 2022

విభాగాల వారీగా ఖాళీలు:

ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్)- 4483

ఆఫీసర్ స్కేల్ I – 2676

ఆఫీసర్ స్కేల్ II (వ్యవసాయ అధికారి) – 12

ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్)- 06

ఆఫీసర్ స్కేల్ II (ట్రెజరీ మేనేజర్)- 10

ఆఫీసర్ స్కేల్ II (లా)- 18

ఆఫీసర్ స్కేల్ II (CA)- 19

ఆఫీసర్ స్కేల్ II (IT)- 57

ఆఫీసర్ స్కేల్ II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)- 745

ఆఫీసర్ స్కేల్ III- 80