భారతీయ వంటకాల(Indian Dishes)లో  కొన్ని వందల రకాల(100 Varieties) కబాబ్‌ల(Kebabs)ను కలిగి ఉన్నాయి, గ్రిల్లింగ్(Grilling), స్కేవరింగ్(Skewering), పాన్-ఫ్రైయింగ్(Pan Frying) లేదా రాయిపై కాల్చడం వంటి అనేక వంట పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు.

షికంపూరి కబాబ్(Shikampuri Kebab), హైదరాబాదు(Hyderabad)లో బాగా ప్రాచుర్యం(Famous) పొందిన మరియు అత్యంత ఇష్టపడే స్టార్టర్(Starter) , ఇది చికెన్/ మటన్,(Chicken/Mutton) మరియు పప్పుధాన్యాల(Lentils)ను కలిపి, రుచిగా ఉండే చిక్కటి పెరుగు(Yogurt)తో తయారుచేయబడిన ఒక రుచికరమైన చికెన్/ మటన్ కబాబ్.

ఈ పైపింగ్(Pipping) హాట్ ఫ్రైడ్ కబాబ్‌(Hot Fried Kebab)లు మిమ్మల్ని మరింత ఇష్టపడేలా చేస్తాయి.  రుచికరమైన షికంపూరి కబాబ్స్ నోటిలో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. మరి హైదరాబాద్ ఫేమస్ షికంపూరి కబాబ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం!

కావాల్సిన పదార్దాలు:

మాంసఖండం – 500 గ్రాముల

చన్నా దాల్ – 1/4 కప్పు

వంట నూనె –  2 టేబుల్ స్పూన్

పచ్చి ఏలకులు  –  6

లవంగాలు – 4

మసాలా పొడి (కబాబ్ చిని) – 1/2 టీస్పూన్

స్టిక్స్ దాల్చిన చెక్క – 2

పాత్‌రూల్ మోంకెస్ లేదా పర్వత నాచు (ఆప్షనల్) –  2

షాహీ  జీరా – 1/౨ టీస్పూన్

ఉల్లిపాయలు – 100 గ్రా

వెల్లుల్లి – 20 రెబ్బలు

ఎర్ర కారం  పొడి – 1 టీస్పూన్

పసుపు –  1/2 tsp

తాజా కొత్తిమీర – 2 టీస్పూన్

తాజా పుదీనా – 2 టీస్పూన్

పచ్చిమిర్చి –  2

నూనె – డీప్ ఫ్రై కి సరిపడా

పెరుగు – 250 గ్రా

పచ్చి మిర్చి – 2

నల్ల మిరియాలు –  1 టీస్పూన్

ఉప్పు – సరిపడా

తయారు చేయు విధానం :

  • కడాయి(pan)లో నూనె పోసి వేడి చేయండి. పచ్చి ఏలకులు(Elachi), లవంగాలు(Cloves), మసాలా పొడి(Masala Powder), దాల్చిన చెక్క(Cinnamon), పర్వత నాచు(Mountain Moss) మరియు రాయల్ జీలకర్ర(Black Cumin) జోడించండి.
  • మీడియం వేడి మీద వాటిని వేయించండి.ఇప్పుడు కొవ్వు లేని(Fatless) మాంసం వేసి ఉడికించండి.
  • మరో ఫ్యాన్ లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, తరువాత చన్నా దాల్, ఉప్పు, ఎర్ర మిరపకాయలు, పసుపు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేయాలి .
  • తరువాత 2 కప్పుల నీరు పోసి పప్పు ఉడికినంత వరకు మరిగించి నీరు పూర్తిగా పీల్చుకోవాలి.
  • మాంసం ఉడికిపోయాక, తీసివేసి, చల్లార్చండి, చల్లారిన మాంసం బ్లెండర్ లో వేసి గ్రైండ్  చేయండి.
  • ఫిల్లింగ్(Filling) కోసం, పెరుగు తీసుకోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర మరియు పుదీనా వేసి .
  • నల్ల మిరియాలు వేసి అన్నింటినీ ఒక గిన్నెలో కలపండి.
  • ఇప్పుడు అని కలిపినా మాంసపు మిశ్రమాన్ని  కొద్దిగా తీసుకుని రౌండ్ గా చుట్టి ఆ మిశ్రమాన్ని ఫ్లాట్ గా చేసి, మధ్యలో ఫిల్లింగ్‌లో కొంత భాగాన్ని ఉంచి దాని పైన మరి కొద్దీ గా మిశ్రమాన్ని వేసి కవర్ చేయండి.
  • కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి, కబాబ్‌లను బ్రౌన్‌(Brown Color)గా అయేంత వరకు వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన

షికంపూరి కబాబ్(Shikampuri Kabab) రెడీ(Ready).