సొరకాయ(Bottle Guard) అంటే కొంతమందికి నచ్చదనుకుంటా.కాని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ జ్యూసు ఆరోగ్యాని(Healthy)కి మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. సొరకాయ పేరు వినగానే చాలా మందికి నోరూరకపోవచ్చు, ఆ పేరు పెద్దలకు ఎంత ప్రీతిపాత్రమో పిల్లలకు అంత బాధాకరం కావచ్చు పిల్లలు, యువత పెద్దగా ఇష్టపడకపోవచ్చు టిఫిన్‌ బాక్సులో ఆ కూర పెడితే పిల్లలు శిక్షగా భావించవచ్చు, కానీ సొరకాయ చేసే మేలు ఇంతింతకాదు.

ఆ కూరగాయ వల్ల ఆరోగ్యానికి వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి సొరకాయ చాలా బాగా సహకరిస్తుందని విశ్లేషకులు(Experts) చెబుతున్నారు.

పసుసురంగుతో కలసిన ఆకుపచ్చరంగులో ఈ కాయ ఉంటుంది. లోపల తెల్లటి గట్టిపదార్థం, అందులో స్పాంజ్‌లాంటి పదార్థంలో తెల్లటి గింజలు ఉంటాయి. ఇదీ ఈ కూరగాయ స్వరూపం.

సంప్రదాయబద్ధమైన వైద్య చికిత్సలో సొరకాయను ఎక్కువగా వాడతారు. సొరకాయను ఏ వ్యాధులకు ఏ రూపంలో వాడతారో, సొరకాయ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుందో, సొరకాయలో ఉండే ఉత్తమ గుణాలు ఏమిటో చూద్దాం.

కాల్షియం, పాస్పరస్‌, విటమిన్ – సి, బి.కాంప్లెక్క్ష్ , సొరకాయలో లబిస్తాయి . సొరకాయలో పీచు పదార్ధం(Fiber) ఎక్కువగా, క్యాలరీలు(Calories) తక్కువగా ఉంటాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది , సులువుగా జీర్ణమవుతుంది. డయూరెటిక్(Diuretic) గా పనిజేస్తుంది .

ముత్రనాళాల(Urinary tract) జబ్బులకు ఇది మంచిది . పచ్చి సొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది(Cures thirst), అలసటను తగ్గిస్తుంది(Reduces fatigue). సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు(Minerals) కూడా సొరకాయ తినడం వల్ల శరీరానికి సమకూరుతాయి.

తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినేవారికి సొరకాయ చక్కటి అదనపు ఆహారంగా పనికివస్తుంది. సొరకాయను ఏ వ్యాధులకు ఏ రూపంలో వాడతారో, సొరకాయ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుందో తెలుసుకుందాం…

ఈ సొరకాయలో 92శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్ ను మీ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల, జీర్ణ క్రియ మరింత వేగవంతం అవుతుంది.

సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి(BP)., మదుమేహ(Diabetes) వ్యాధిగ్రస్తురకు సొరకాయ మంచి ఆహారం అని అందరూ ఒప్పుకుంటారు. ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో, వారు సొరకాయను తిని, శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్(Insulin Levels) ను సమతుల్యంగా ఉంచుకోండి.

మీకు ఉన్నట్లుండి శరీరంలో ఉష్ణోగ్రత అధికం అవుతున్నట్లైతే, అలాగే సెడన్ గా తిరిగి చల్లదనం పొందితే, దీనికి కారణం మీ శరీరంలో ప్లే(havoc)తగ్గిపోవడమే. ఈ ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేసుకోవడానికి, ఈ బాటిల్ గార్డ్, సొరకాయను తీసుకుంటే మంచిది. ఇది మీ శరీరంలో ఉష్ణోగ్రత(Temperature)ను క్రమబద్దం(regularity) చేస్తుంది.