15వారాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ నేడు ముగుస్తోంది …ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మన బిగ్ బాస్  సీజన్ 4 గ్రాండ్ ఫైనల్ . దీని కోసం వేదిక సరికొత్తగా సిద్ధం అవుతుంది. సూపర్ ఎంటర్టైన్మెంట్ తో టాలీవుడ్ స్టార్స్ ఆటలు, పాటల తో హోస్ట్ కింగ్ నాగార్జున ఫినాలేను అత్యంత  వైభవంగా నిర్వహించనున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన తెలుగు బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ ఎవరవుతారనే ఆసక్తి  తెలుగు వారి ఇంట చర్చా అంశం అయ్యింది.

గత వారమే ఫైనలిస్ట్స్ ఎంపిక కాగా, ఎవరు విన్నర్ కానున్నారనే చర్చలు,ఊహాగానాలు మొదలైపోయాయి. ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి రీత్యా పలు మీడియా సంస్థలు విన్నర్ ఎవరనే విషయంపై పోల్స్,కాపిటషన్స్ ,క్యాష్ ఆఫర్స్ ఇలా వివిధ రకాలు గా ప్రచారాలు  నిర్వహించడం జరిగింది.

గెస్ట్ ఎవరు ??

బిగ్ బాస్ ఫినాలేకు ఫైనల్ రోజు న ప్రతీ  సారి టాలీవుడ్ నుండి టాప్ స్టార్ గెస్ట్ రావడం ఆనవాయితీగా ఉంది. ఇది వరకు బిగ్ బాస్ 3 కి మెగా స్టార్ చిరు గెస్ట్ గా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే .దీని తో ఈ రోజు జరిగే బిగ్ బాస్ 4 కి ఎవరు ప్రత్యేక అతిధి అనేది బహు ఆత్రుత గా చర్చా అంశం గా మారింది.

Big boss 4

Big boss 4 entertainment show

అయితే యంగ్ హీరోయిన్ మెహ్రీన్, లక్ష్మీ రాయ్ రానున్నారు అని పలు పత్రికల్లో ,న్యూస్ ఛానెల్స్ లో ను ప్రచారం జరుగుతోంది . అలాగే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రానున్నారు అంటున్నారు .

మరి కొంత మంది లవ్ స్టోరీ సినిమా లో జత కట్టిన నాగ చైత్యన్య ,సాయి పల్లవి ముఖ్య అతిధులు గా విచ్చేసి బిగ్ బాస్ 4 ని మరింత కలర్ ఫుల్ గా చేయనున్నారు అని సమాచారం.  కింగ్ నాగ్ హోస్ట్ గా ఉన్న  బిగ్ బాస్ 4 వేదికపైకి అక్కినేని వారి అబ్బాయి నాగ చైతన్య రావడం విశేషమే అని చెప్పాలి.

టైటిల్ ఎవరి సొంతం ??

ఫైనల్ లిస్ట్ కి అభిజీత్, అరియనా, అఖిల్, హారిక ,మరియు సోహైల్ చేరుకోగా వీరిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ అందుకోనున్నారు. టైటిల్ ఎవరి సొంతం అని ఎదురు చూపులు చూస్తున్నారు ప్రేక్షకులు అంతా.

Bigboss 4 title

Who wins Bigboss 4

ఏది ఏమైనా బిగ్ బాస్ 4 కోసం తెలుగు వారు అంత ఆత్రుత గా ,ఎప్పుడు ఎప్పుడా అంటూ ఎదురు చూపులు చూస్తునారు . చూద్దాం మరి ఈ బిగ్ బాస్ టైటిల్ ఎవరి సొంతమో, విజేత ఎవరో చూడాలి  !

ఈ ఆర్టికల్ లో లాగా నే ,మీరు కూడా బిగ్ బాస్ కోసం ఆత్రుత గా ఉన్నారా ? ఇదే చర్చా అంశం గా ఉందా ? అయితే ఇప్పుడే దీన్ని మీ సోషల్ మీడియా వాల్స్ మీద షేర్ చేసేయండి మరి !