Heart (గుండె). మన శరీరం లో అతి ముఖ్యమైన అవయవం. మన శరీరం మొత్తానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. అటువంటి గుండె ఆగిపోతే మనిషి చనిపోతాడు. ఆ చనిపోయిన వ్యక్తి నుంచి గుండెను సేకరించి మరో వ్యక్తికి అమర్చడమే అవయవ దానం. ఇలా మరో వ్యక్తికి ప్రాణం పోసినట్లే. అవయవ దానం ఎంతో గొప్ప పని. అవసరమైన వారికి మరణానoతరం తన అవయవాలను దానం చేయడం ఎంతో  గొప్ప ఆలోచన కూడా. ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మందికి వేరొక గుండె అవసరం. ఇలా అవయవాలను దానం చేసే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎంతో మంది ఉదారంగా దానం చేస్తున్నా, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఇటువంటి అవయవ దానాలు నిష్ప్రయోజనం అవుతున్నాయి. కారణం, ఇప్పటి వరకూ సరైన రీతిలో అవయవాలను భద్రపరచలేకపోవడం వల్ల.

ఎందుకంటే బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి సేకరించిన గుండెను, గుండె మార్పిడి శస్త్ర చికిత్సల్లో ఉపయోగించేటప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి గుండెను త్వరగా సేకరించాలి. జాప్యం జరిగితే ఆ గుండె లేదా అవయవం మార్పిడి కి పనికి రాదు. ఇప్పటి దాకా అవయవాలను ప్లాస్టిక్ కూలర్స్ లో భద్రపరుస్తున్నారు. వీటిని త్వరగా వినియోగించకపోతే అవి నిరుపయోగం అయిపోతాయి. ఈ నేపధ్యం లో అమెరికా లోని Transmedics అనే ఒక సంస్థ ఒక కొత్త పరికరాన్ని తయారు చేసింది. ఇది ఒక పెట్టెలా ఉంటుంది.

heart

 

దీనిలో చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెని దీనిలో అమర్చి దీనికి మన శరీరం లాగానే గొట్టాల ద్వారా రక్తాన్ని, ఆక్సిజన్ కృత్రిమంగా ఏర్పాటు చేయడం ద్వారా తిరిగి ఆ గుండె ను కొట్టుకునేలా చేయగలిగారు. ఇది వైద్య శాస్త్రం లోనే ఒక అద్భుతం. ఎందుకంటే ఒకసారి ఆగిపోయిన గుండె ను, అదీ మనిషి శరీరం అవతల కొట్టుకునేలా చేయడం అద్భుతమే మరి. ఈ పరికరం వల్ల గుండె మార్పిడి శస్త్ర చికిత్సలలో పెరుగుదల ఉంటుందని అంటున్నారు వైద్యులు.ఈ పరికరం ద్వారా ఇప్పటికి 15 శాస్త్ర చికిత్సలు విజయవంతంగా చేసారు UK, ఆస్ట్రేలియా కు చెందిన వైద్యులు.

వైద్య శాత్రం లో ఒక చరిత్ర సృష్టించగల ఈ పరకారం ధర మాత్రం చుక్కల్లోనే ఉంది. దీని ధర $2,50,000.

ఏది ఏమైనా ఈ పద్ధతిలో మరి కొన్ని అవయవాలను భద్రపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఇదే జరిగితే సృష్టికి ప్రతి సృష్టి చేయగలడని మనిషి నిరూపించినట్టే.

Courtesy