రాష్ట్ర వ్యాప్తం(State Wide)గా ఏప్రిల్ 3(April 3rd) వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్(Tenth Exams) ప్రారంభంకానున్నట్లు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మంత్రి(Minister) సబితారెడ్డి(Sabita reddy) మాట్లాడుతూ ఎగ్జామ్స్ ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్రకటించారు.

విద్యార్థులను 9:35 గంట‌ల వ‌ర‌కు అనుమతిస్తామన్నారు. ఇప్పటికే హాల్ టికెట్ల‌(Hall tickets)ను ఆయా స్కూళ్లకు పంపించామన్నారు. అయితే విద్యార్థులు వెబ్‌సైట్(Website) నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌న్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు త‌మ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చ‌ని సూచించారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వ‌ర‌కు నిర్వహించే టెన్త్ ఎగ్జామ్స్ పై జిల్లా కలెక్టర్లతో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు కాకుండా సంసిద్ధం కావాలని సూచించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత యాజమాన్యాలతో పాటు టీచర్లకు(Teachers), పేరెంట్స్(Parents) పై ఉందన్నారు.

హాల్​టికెట్లను సంబంధిత పాఠశాలలకు ఇప్పటికే పంపించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులే స్వయంగా డౌన్​లోడ్(Download) చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షా పేపర్లను 11 నుంచి 6 పేప‌ర్ల‌కు కుదించామన్నారు. సైన్స్ పరీక్షా రోజున భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రంకు సంబంధించి ప్రశ్నా పత్రాలను, జ‌వాబు ప‌త్రాల‌ను విడివిడిగా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర‌వుతార‌ని మంత్రి తెలిపారు.2,652 పరీక్షా కేంద్రాల(Exam Centers)ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ప‌రీక్ష‌ల‌ నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్(Control Room) ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న టెన్త్ ఎగ్జామ్స్ ను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.