మెగా కాంపౌండ్(Mega Compound) నుండి ఎంట్రీ ఇచ్చిన, టాలీవుడ్(Tolly wood) యంగ్ హీరో(Young Hero) వరుణ్ తేజ్(Varuntej).  దింతో అతని ప్రతి సినిమా భారీ అంచనాల(Huge Expectations)తో విడుదల అవుతుంది.

కానీ చివరిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా(Sports Drama) ‘గని(Ghani)’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎఫ్3(F3)’తో విజయాన్ని అందుకున్నారు.

ఇక తన తదుపరిఐ చిత్రాల పైనా వరుణ్ తేజ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్స్ తో 12వ మరియు 13వ చిత్రాలను అనౌన్స్(Announce) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ VT12 పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్(Crazy Update) వచ్చింది. గోస్ట్ డైరెక్టర్(Director) ప్రవీణ్ సత్తార్(Praveen Sattar) దర్శకత్వంలో VT12 తెరకెక్కబోతోంది. వరుణ్ తేజ్ ను నెక్ట్స్ లెవల్లో చూపించబోతున్నట్టు సమాచారం.

తాజాగా ఈ చిత్రం టైటిల్(Title) ను, అదే విధంగా ఫస్ట్ లుక్(First Look) పోస్టర్ ను జనవరి 19(January 19th)న విడుదల చేయబోతున్నట్టు  ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో వరుణ్ తేజ్ చేతిలో పవర్ ఫుల్ వెపన్(Weapon) ను పట్టుకొని స్టైలిష్ లుక్(Stylish Look) లో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఫస్ట్ లుక్ పై ఆసక్తిని పెంచుతోంది. ఇక మెగా ప్రిన్స్ నటిస్తున్న 12వ సినిమా వివరాల్లోకి వెళితే.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రూపొందుతోంది.

మిక్కీ జె మేయర్(Mickey J Mayor) ఈ మూవీకి సంగీతాన్ని(Music) సమకూర్చుతున్నారు. అవినాష్ కొల్లా(Avinash Kolla) ఆర్ట్ డిపార్ట్‌ మెంట్‌(Art Department)కి హెడ్‌(Head)గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్(Shooting) శరవేగంగా కొనసాగుతోంది.  ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న VT13పైనే అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈప్రాజెక్ట్ ను డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేయనున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకోనుంది.

ఇందులో దేశం కోసం పోరాడే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్(Air Force Officer) గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.