నాని(Nani) కెరీర్‌(Career)లో తొలిసారి మాస్(Mass) అవతార్‌లో కనిపించనున్న దసరా(Dasara) సినిమా ప్రేక్షకులు(Audience) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) అనే నూతన దర్శకుడు(New Director) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 80వ దశకంలో తెలంగాణా నేపథ్యం(Telangana Background)లో తెరకెక్కుతోంది.

చిత్రీకరణ(Shooting) పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్‌(Teaser)ను ఈ నెల 30న అత్యంత గ్రాండ్‌(Grand)గా విడుదల(Release) చేసింది.  ఈ మూవీ లో నాని రా అండ్ రస్టిక్ లుక్(Raw and Rustic Look) లో కనిపించడమే కాకుండా పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్(Mass Entertainer) గా సినిమా రూపొందుతూ ఉండడంతో సినిమా మీద అందరి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ టీజర్ ఆద్యంతం ఒళ్ళు గగ్గురుపొడిచేలా సాగింది.

సినిమాలో నాని గోదావరిఖని సింగరేణి గనుల్లో పనిచేసే ఒక కార్మికుడిగా కనిపిస్తుండగా ఆ గనుల నేపథ్యంలోనే సినిమా మొత్తం సాగినట్లుగా టీజర్ ద్వారా అర్థమవుతుంది. సుకుమార్ శిష్యుడే కావడంతో ఈ సినిమా దర్శకుడి మేకింగ్(Making) మీద కూడా అందరూ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మందంటే ఒక వ్యసనం కాదు ఇది మా ఆచారం అని అర్థం వచ్చేలా నాని చెబుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్(Keerthi Suresh), హీరోయిన్(Heroine) గా నటిస్తోంది. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌(Huge Budget)తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమా విజయం తనని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తుందని నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమాలో సముద్రఖని, దీక్షిత్ శెట్టి(deekshith Shetty), షైన్ టామ్ చాకో(Shine Tam Chaco) వంటి ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా సినిమాలో భాగమయ్యారు. అలాగే అలనాటి నటి జరినా వాహబ్(Jarina vahab), సాయి కుమార్(Sai Kumar) వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల(Key Role) లో నటిస్తున్నారు.

నిమిషం 15 సెకండ్ల పాటు సాగిన దసరా టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పక తప్పదు.

ఈ సినిమా తెలుగు(Telugu) టీజర్‌ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS rajamouli) విడుదల చేయగా తమిళ టీజర్‌(Tamil Teaser)ను విలక్షణ నటుడు ధనుష్, కన్నడ(Kannada) టీజర్‌ను రక్షిత్ శెట్టి(Rakshith Shetty), మలయాళ(Malayam) టీజర్‌ను దుల్కర్ సల్మాన్(Dulquer Salman), హిందీ టీజర్‌ను షాహిద్ కపూర్లు(Shahid Kapoor) రిలీజ్ చేశారు.

తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానుంది.