తెలంగాణ(Telangana) లోని లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది. మొత్తం 9 విభాగాల్లోని పోస్టులకు సంబంధించిన వెబ్ నోట్(Web note) ను  తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) ఇటీవల విడుదల(Release) చేసింది.

కేటగిరీల(Categories) వారీగా దరఖాస్తు ప్రక్రియ(Application Process)ను ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభించున్నారు. అయితే ఇందు కోసం అభ్యర్థులు(Candidates) వన్ టైం రిజిస్ట్రేషన్(One Time Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటీఆర్ తో అభ్యర్థులు తమ అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే.. ఈ ఓటీఆర్ (TRE-RB OTR)  ప్రక్రియ ఏప్రిల్ 12వ తేదీ  నుంచి ప్రారంభం అయింది. ఇందు కోసం రిక్రూట్మెంట్ బోర్డ్(Recruitment Board) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన టెస్టింగ్ సైతం పూర్తి చేసినట్లు సమాచారం.

ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులకే వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఏర్పడుతుంది. పూర్తి వివరాల(Full Details) కోసం అధికారిక వెబ్ సైట్(Official Website): https://treirb.telangana.gov.in/ సందర్శించాల్సి ఉంటుంది.

ఓటీఆర్ తో ప్రయోజనాలివే:

సాధారణంగా అనేక మంది అభ్యర్థులు తమ విద్యార్హతల(Students)తో ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే సమయంలో వ్యక్తి గత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సి వస్తే ఇబ్బంది ఉంటుంది.

అదే ఓటీఆర్ ఉంటే దరఖాస్తు ప్రక్రియ సులభం అవుతుంది. ఎన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నా, వ్యక్తిగత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.

కేవలం ఓటీఆర్ నంబర్(OTR Number) ను నమోదుతో పాటు కొన్ని వివరాలను మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది.