అల్ఫబేట్ అంటే మనకు తెలియకపోవచ్చు కానీ గూగుల్ అంటే మనకు తెలుసు. ఇంచుమించుగా ఈ గూగుల్ మన నిత్య జీవితంలో భాగమైపోయింది కదూ. అలాంటి ఈ గూగుల్ Alphabet అనే సంస్థలో భాగం అని మీకు తెలుసా. Alphabet కు గూగుల్ వంటి కంపెనీలే కాదు మరెన్నో కంపెనీలు లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ ఇంకా ఎన్నో ఇతర రంగాల్లో ఉన్నాయి. సరే అయితే ఏంటి అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. రోబోటిక్స్ గురించి మనకు తెలుసు కదా. ఈ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం విశేష కృషీ పరిశోధనా చేస్తున్నాయి. ఈ రోబోట్ లతో మనుషులకు ప్రత్యామ్న్యాయంగా, మనుషులు చేసే పనులను కూడా చేసేట్టు వీటిని తయారు చేస్తున్నారు. అయితే ఈ రోబోట్ లకు మన లాంటి చాకచక్యం ఎక్కడుంటుంది అనుకుంటే పొరపడినట్టే. మనకు దీటుగా వీటిని మనలాంటి వారే తయారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ Alphabet టోక్యో లో తాజాగా జరిగిన “New Economic Summit” లో దీనిని ప్రదర్శించారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడచ్చు.

ఇక దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక bi-pedal robot అంటే మన లాగే రెండు కాళ్లున్న robot. అంతే కాదు ఇది ఇది రోబోట్ లకు ఉన్న పరిమితిని దాటుకుని మన లాగే మెట్లు ఎక్కగలదు, ఎత్తైన ప్రదేశాలను సైతం ఎక్కగలదు, దిగ గలదు. ఇక దీని మధ్య భాగం పనిని బట్టి పైకి కిందకీ సైతం అదే మార్చుకోగలదు. ఇంకా 60 కేజీ ల వరకూ బరువును మోయగలదు. ఇది అత్యంత తక్కువ ఖర్చుతో తక్కువ పవర్ వినియోగించెట్టు దీన్ని రూపొందించారు. అలా దీన్ని ప్రజలకు ఉపయుక్తంగా ఉండేట్టు తయారు చేసామని ఈ సంస్థ పేర్కొంది.

ఏమో భవిష్యత్తులో ఈ రోబోట్లు ఎలాంటి మాయాజాలం చేస్తాయో వేచి చూడాల్సిందే.