భారతీయ మార్కెట్లో(Indian Market) ద్విచక్ర వాహనాల(Two Wheeler Vehicles) విభాగంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బైక్‌లకు వాటి జనాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ బైక్‌లకు ఎప్పటి నుంచో డిమాండ్(Demand) విపరీతంగా ఉంది. ఇప్పటికే క్లాసిక్ 350(Classic 350), మీటోర్ 350(Metero350), ఇంటర్‌సెప్టర్ 650(Interceptor 650), హిమాలయన్(Himalayan) విక్రయాలతో వేగంగా దూసుకెళ్తున్న కంపెనీ త్వరలో మరో నాలుగు బైక్‌ల(Four Bikes)ను విడుదల(Release) చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ విడుదల చేయనున్న ఈ నాలుగు బైక్‌ల గురించి మరిన్ని వివరాలను  తెలుసుకుందాం!

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450

గత కొన్ని రోజులుగా కంపెనీ హిమాలయన్ 450ని లాంచ్ చేయనుందని పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ మోడల్‌పై కూడా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఇందులో 450 సీసీ ఇంజన్(450 CC Engine) ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది దీపావళి నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్(Bullet) అని చాలా మంది భావించే మొదటి బైక్. ఈ పేరు బైక్‌ నడిపేవారి మదిలో పాతుకుపోయింది. అయితే ఈ బైక్ త్వరలో కొత్త వెర్షన్‌(New Version)గా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త తరం బుల్లెట్ 350 క్లాసిక్ మాదిరిగా కాకుండా సరికొత్త డిజైన్‌(New Design)ను పొందుతుందని సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650

ప్రస్తుతం 350 సీసీ సెగ్మెంట్(Segment) మాదిరిగానే 650 సీసీ విభాగంలో విడుదలయ్యే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650(Continental GT 650) ఉన్నాయి. కంపెనీ షాట్‌గన్ 650ని ఈ విభాగంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బాబర్ 350

మార్కెట్లో జావా కంపెనీ విక్రయిస్తున్న బాబర్ బైక్ గురించి మీరు వినే ఉంటారు. అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బాబర్ 350(Classic Babur 350) పేరుతో కొత్త బికా(New Bike)ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ గురించి అధికారిక వివరాలు(Official Details) ఇంకా వెల్లడి కాలేదు, అయితే ఇది ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.