మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అదికూడా మన వంటింట్లోనే ఉంది. మనం  నిత్యం వంట చేసినప్పుడల్లా వాడే పోపుల పెట్టెలోనే దాగుంది. పోపుల పెట్టెలో ఉండే నల్ల మిరియాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

క్వీన్ ఆఫ్ స్పైసెస్(Queen of Spices) గా పిలువబడే మిరియాలు, ఘాటుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

మిరియాల(Pepper)లో పోషకాలు(Nutrients), యాంటీ బ్యాక్టీరియల్ (Anti Bacterial)గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్(Anti Oxidants) అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాల(Black Pepper)కి ప్రత్యేక స్థానముంది. వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారంలో  రుచిని పెంచడానికి మిరియాల ఘాటు తగలాల్సిందే.

వంటల్లోనే కాదు, ఔషధం(Medicine)గా కూడా మిరియాలను ఉపయోగిస్తారు. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి(Health Benefits).

ఆకలిగా ఉండటం లేదని చాలామంది ఫీలవుతూ ఉంటారు. ఇలా సమయానికి ఆహారం తీసుకోకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్(Breast Cancer) నివారించడానికి మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి(Vitamin A,C), కెరోటిన్స్(Keratins), ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరంలో ఉండే హానికారక ప్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ(Skin),పెద్దపేగు క్యాన్సర్ల(Large Intestine Cancers) ముప్పు కూడా తగ్గుతుందని  రీసెర్చ్ తేల్చాయి.

మిరియాల పై పొరలో ఫైటో న్యూట్రియంట్(Phyto Nutrients) సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడడంతో పాటు రక్తనాళా(Blood Vessels)ల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు(BP) నుంచి కాపాడుతాయి.

కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్లే ఆరోగ్యమే కాదు ఫిట్ గానూ ఉండవచ్చు. ఆందోళన, ఒత్తిడి(Stress) చాలా మందిని వేధించే సమస్య. కాబట్టి మిరియాలలో ఉండే పైపెరైన్(Piperine) అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

మిరియాల్లో అధికంగా ఉండే పెపెరైన్ అనే ఆల్కలాయిడ్(Alkaloid) జీర్ణవ్యవస్థ(digestive system) లో ఎక్కువమొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లు ఈజీగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్, విరేచనాలు సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి మిరియాలను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

చిన్న పిల్లల్లో లేదా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా దగ్గు(Cough), జబులు(Cold) వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఒక కప్పు నీటిలో మిరియాల పొడి, ఉప్పు.. రెండింటినీ సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్ట్ ని చిగుళ్ల(Gums)పై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చిగుళ్ల ఆరోగ్యం మెరుగవడమే కాదు పలు దంత సమస్యల(Dental Problems) నుంచి బయటపడవచ్చు.

యాభై గ్రాముల మిరియాల పొడిని తీసుకుని దానికి 600 మిల్లీలీటర్ల నీళ్లు చేర్చి అరగంట మరిగించాలి. ఈ నీటిని వడగట్టి రోజుకి మూడు సార్లు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు.

మిరియాలతో చేసిన టీ తాగితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థ(Immunity System)కు చేరుస్తుంది.

చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే కండరాలు, నరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి లేదా వాపు ఉన్న ప్రాంతంలో కడితే నొప్పి, వాపు తగ్గుతాయి. చర్మవ్యాధులు(Skin Problems), గాయాలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యి(Ghee)తో కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది.

మొటిమలు(Pimples) ఎక్కువగా వేధిస్తుంటే మిరియాలు యాంటీ బయోటిక్(Anti Biotic) గా పనిచేస్తాయి. మిరియాలను పొడి చేసి స్ర్కబర్ తో కలిపి ముఖంపై రుద్దడం వల్ల మొటిమలతో పాటు, డెడ్ స్కిన్(Dead Skin) తొలగిస్తుంది. యువతరాన్ని ఎక్కువగా వేధిస్తున్న సమస్య చుండ్రు. దీన్ని పోగొట్టుకోవడానికి షాపూలకు బదులు మిరియాల ట్రీట్మెంట్ ట్రై చేయండి.

పెప్పర్ లోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రు(Dandruff) వదిలించడంలో గొప్పగా సహాయపడుతాయి. పెరుగులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి కలిపి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి.

అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. కేవలంతో నీటితో క్లీన్ చేసుకోవాలి షాంపూ వాడకూడదు.