అనేక రోగాలకు దివ్యౌషధాలు(Medicine) మన వంటింట్లోని పోపుల పెట్టెలోనే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది కరక్కాయ(Karakkaya).

కరక్కాయను సంస్కృతం లో హరిటకి అంటారు. దీని శాస్త్రీయ నామం(Scientific Name) టెర్మినాలియా చెబ్యూలా(Terminalia chebula).

ఇది వాతగుణాలను తగ్గించి, బుద్ధిని వికసింపజేస్తుంది. అంతేకాదు శక్తినిచ్చి, ఆయుష్షును పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు దీనిలో ఉంటాయి. మలబద్దకాన్ని నివారించడానికి సరైన ఔషధం. అలాగే పైల్స్‌(piles)పై కూడా ప్రభావం చూపుతుంది. యాంటి స్పాస్మడిక్(Antispasmodic), యాంటీ పైరేతిక్‌(Antipyretic) గానూ పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరం, ఎక్కిళ్లు, వాంతులను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆందోళన, నాడీమండల నిస్త్రాణాన్ని(Nervous system) నియంత్రిస్తుంది.

కరక్కాయ పెంకులు(Karakaya Shells), వస ఆకులు(Vasa Leaves) కలిపి రెండు రోజులు నానబెట్టాలి. తర్వాత వీటిని ఎండబెట్టి పొడిచేసి పూటకు అర టీస్పూన్ చొప్పున నేరుగా లేదా తేనెతో కలిపి తీసుకుంటే అవయవాల్లో అంతర్గత రక్తస్రావం ఆగుతుంది.

కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసి, అర టీస్పూన్ చొప్పున రోజుకు మూడుసార్లు తేనె లేదా నీటిలో కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.

ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు అరచెంచాడు కరక్కాయ చూర్ణాన్ని వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆయాసం(fatigue), ఎక్కిళ్లు(Hiccups) సతమతమయ్యేవారు బెల్లం పానకంలో కరక్కాయను ఉడికించి తీసుకోవాలి.

రక్తహీనత(Anemia)తో బాధపడేవారు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, తర్వాత ఎండబెట్టి, పొడిచేసి, రోజుకు రెండుసార్లు అర టీస్పూన్ చొప్పున నీళ్లతో కలిపి తీసుకోవాలి. కరక్కాయ, తానికాయ, ఉసిరిని గోమూత్రంలో ఉడికించి, మెత్తగా నూరి టీ స్పూన్ చొప్పున తీసుకుంటే కామెర్లు, రక్తహీనతలు తగ్గుతాయి.

కరక్కాయ, శొంఠి కలిపి చూర్ణం చేసి బెల్లం కలిపి నిల్వ చేసుకొని రోజుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగితే మలబద్ధకం తగ్గుతుంది.

కరక్కాయ, శొంఠి మిశ్రమానికి బెల్లం కలిపి, రోజుకు రెండుసార్లు అర చెంచాడు చొప్పున మజ్జిగతోపాటు తీసుకుంటే శరీరంలో చేరిన అదనపు నీరు(External Water) బయటకుపోతుంది.