ఇండియన్‌ నేవీ(Indian Navy) 2023 జనవరి(ఎస్‌టీ 23) కోర్సు.. వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల(Short Service Commission Officers) భర్తీకి అవివాహితులైన(Unmarried) స్త్రీ, పురుష అభ్యర్థుల(Female, Male Candidates) నుంచి దరఖాస్తులు(Applications) కోరుతోంది.

పూర్తి వివరాలలోకి వెళితే 

మొత్తం పోస్టుల సంఖ్య: 155

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌(Executive Branch)–93, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (Education)–17, టెక్నికల్‌ బ్రాంచ్‌(Technical Branch)–45.

ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌:

విభాగాలు: జనరల్‌ సర్వీస్(General Services), ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్(Air Traffic Controller), అబ్జర్వర్(Observer), పైలట్(Pilot), లాజిస్టిక్స్‌(Logistics).

అర్హత: కనీసం 60శాతం మార్కుల(60 Percent Marks)తో ఏదైనా విభాగంలో బీఈ(B.E)/బీటెక్‌(B.Tech) ఉత్తీర్ణులవ్వాలి(Qualify). సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు(Technical Experience) ఉండాలి.

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌(ఎడ్యుకేషన్‌):

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ(B.E)/బీటెక్(B.Tech), ఎంఏ(M.A), ఎమ్మెస్సీ(M.Sc) ఉత్తీర్ణులవ్వాలి.

టెక్నికల్‌ బ్రాంచ్‌:

విభాగాలు: ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(Engineering Branch)(జనరల్‌ సర్వీస్‌), ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(Electrical Branch)(జనరల్‌ సర్వీస్‌).

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ(B.E)/బీటెక్‌(B.Tech) ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్(Short Listing), ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు(SSB Interview), మెడికల్‌ టెస్ట్‌(Medical Test) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌(Online) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.03.2022

వెబ్‌సైట్‌: https://joinindiannavy.gov.in/