దసర(Dasara) పండు(Festival)గా హిందువుల(Hindus) ముఖ్యమైన పండుగా ఆశ్వయుజ(Asvayuja) శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమిది రోజులు దేవి నవరాత్రులు(Navaratri) పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.

ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగా, ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి(Sharanavaratri) అని అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగా కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతికి, తరువాత మూడు రోజు లక్ష్మి దేవికి, తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.

బొమ్మల కొలువు(Bommala Koluvu) పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు, ఒక్కో అలంకారం చేస్తారు. పదవ రోజు పార్వేట ఉంటుంది. విజయ దశమి(Vijaya Dasami) రోజున చరిత్ర(Histroy) ప్రకారం రాముడు, రావణుడి పై గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలు తిరిగి తీసిన రోజు. ఈ సందర్భాన రవాణా వధ, జమ్మి ఆకుల పూజ(Jammi Pooja) చేయడం ఆనవాయితీ.

జగన్నమాత అయినా దుర్గ దేవి(Durga Devi) మహిషాసురు(Mahishasura)డు అనే రాక్షసుని తో తొమిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భాన పదవ రోజు ప్రజలంతా సంతోషంతో  పండగ జరుపుకున్నారు, అదే విజయ దశమి.

మహిషాసుర మర్దిని దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి మరణంలేని జీవనం కోసం మీరు పర్వత శిఖరం చేరి  బ్రహ్మదేవు(Bramha dev)ని గూర్చి ఘోర తప్పసు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేళా సంవత్సరాలు కదలి వెళ్లిపోయాయి.

మహిసాసుర అచంచల తప్పసుకు సంతసించిన బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై మహిసాసుర ఇంకా తప్పసు చాలించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. పితామహ నేను అమరుడిని కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని మహిషాసురుడు, బ్రహ్మను కోరాడు.

అప్పుడు బ్రహ్మ దేవుడు మహిసాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.గిట్టినా ప్రాణి మరల పుట్టాక తప్పదు. ప్రకృతికి విరుద్ధమైన నీ తీర్చడం అసంభవం కనుక నీ మరణకి, మృతువుకు ఒక మార్గం విడిచి పెట్టి మరే వరమైన కోరుకో అన్నారు.

అప్పుడు మహిషాసురు(Mahisasura)డు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే ఆడది నా దృష్టిలో ఓ అబల ఆమె వల్ల నాకు ఏ ప్రమాదం రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు. బ్రహ్మ దేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్దానమైయి పోయాడు.

బ్రహ్మ దేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవాలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహీసురిడి పై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖంగా, విష్ణు తేజము భవులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగిన మంగళ మూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి వుంది. మహిషాసురుడి తరపున కోరుసలుపుతున్న ఉద్దుర్దుడు.

మహామహుడు, మహాహలుడు, అసిలోముడు, బాష్కలుడు, విడలడుడు మొదలన వారిని సంహరించిన తరువాత మహిషాసురుడితో తలపడి, దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపముతో భీకరంగా పోరాడి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.

ఈ రోజుల్లో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చింది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు  లేదా పగటి వేషాలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడుచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికి, కూతురికి తలంటి నూతన వస్త్రాలు కానుకలుగా ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.

దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు శైలపుత్రి(Shailaputri), రెండవ రోజున బ్రహ్మచారిణి(Bramhacharini), మూడవ నాడు చంద్ర ఘంటా దేవి(Chandra Ganta devi), నాలుగోవ రోజున కుష్మండ దేవి(Kushmanda Devi), ఐదవ రోజున స్కంద మాత(Skanda math), ఆరొవ రోజున దాక్షాయణి(Dakshayani), ఏడవరోజున కాళరాత్రి(Kalaratri), ఎనిమదవ రోజున మహా గౌరీ(Maha Gowri), తొమ్మిదొవ రోజున సిద్ది(Siddi)గా  పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతి దేవిని, కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా,బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిసాసుర మర్దినిగా ఆరాధిస్తారు.

అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ . ఆ అమ్మకి బ్రహ్మోత్సవం దేవి శరన్నవరాత్రుల వైభవం. దసరా నవరాత్రులలో రోజుకో రూపంలో భక్తులను కాటాక్షించే ఆ జగన్మాతను కొలిచే భాగ్యం మనందరిది. ఈ నవరాత్రులు అమ్మకి ఎలాంటి నైవేద్యాల(Naivedyaas)తో పూజించి ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం.

వడప్పు, పానకం, తియ్యటిబూంది, పాయసం, చలివిడి, రవ్వకేసరి, పులిహోర, బూరెలు, పొంగలి,  క్షిరన్నం,అటుకులు, గారెలు, చక్కర పొంగలి వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఈ నవరాత్రుల్లో అందరు భక్తి శ్రద్దలతో అమ్మని పూజించి అమ్మ కృపకు పాత్రులుకండి.