వేడి వేడి టీ తాగుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. వాతావరణ మెరుపులను బట్టి మనం  ఇమ్యూనిటీను బూస్ట్(Immunity Boost) చేసుకోవడం ఎంతో ముఖ్యం. దానివల్ల ఎన్నో రోగాలు(Diseases), ఇన్ఫెక్షన్ల(Infections) నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో  చల్లటి వాతావరణమనేది వేడి వేడి ఆహారాలను  తీసుకోవాలన్న కోరికను పెంచుతుంది. అలాగే వేడి వేడి డ్రింక్స్(Hot Drinks) ను తాగాలన్న క్రేవింగ్స్ ను పెంచుతుంది. బెస్ట్ ఆప్షన్ గా ముందుగా మనకు గుర్తుకు వచ్చేది టీ(TEA).

వేడి వేడి కప్పు టీ తాగితే ఎంతో ఉపశమనం(Relax)గా ఉంటుంది. అంతే కాకుండా నిజానికి ఏ టీ తగిన పని ఒత్తిడి(Work Stress) నుంచి ఉపాసనం లభించి కొత్త శక్తినిస్తుంది. అయితే రోజులో ఎక్కువ సార్లు సంప్రదాయ టీ తాగారంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

కాబట్టి టీ తాగుతూనే చురుకైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే చక్కని పరిష్కారం హెర్బల్ టీ(Herbal tea). అసలు ఈ హెర్బల్ టీ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకార ప్రయోజనాలు వున్నాయి. ఇక్కడ తెలుసుకుందాం.

ఉద్యోగులు, వ్యాపారాలు, కార్మికులు, ఇలా పని ఒత్తడి నుంచి రిఫ్రెష్ అవ్వడానికి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, తీసుకుంటూ వుంటారు. అంతేకాదు స్నేహితులతో సరదాగా మాట్లాడుకుంటు కూడా టీ, కాఫీ లు తాగటం చాలా మందికి అలవాటు. టీ, కాఫీ తాగడం వల్ల ఎదో తెలియని ఉత్సహం వచ్చినట్టు అనిపిస్తుంది.

అంతే కాకూండా ఉదయం, సాయంత్రం కచ్చితంగా టీ లేదా కాఫీ లేకుంటే ఎదో కోల్పోయినట్టు ఉంటుందంటే అవి మన జీవితం లో ఏ మేరకు భాగస్వామ్యం ఐంది అర్థంచేసుకోవచ్చు. అయితే సాధారణ టీ, కాఫీ లు రోజుకు రెండు నుంచి మూడు సార్లు అయితే పర్వాలేదు కానీ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందులో వుండే కెఫిన్, చెక్కర ఆరోగ్యం పై ప్రభావితం చూపిస్తాయి.

ఈ క్రమంలో ఆరోగ్యానికి ప్రయోజనాలు(Health Benefits) కలిగించే హెర్బల్ టీలు ఎంచుకోవచ్చు. భారతీయ సంప్రదాయంలో(Traditional) ఈ హెర్బల్ టీ(Herbal Tea) సంస్కృతి పురాతన కలం నుంచి వస్తున్నాయి. వీటిలోని ఔషధ(Medicinal) గుణాలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ హెర్బల్ టీ అంటే మూలికలతో చేసే ఒక రకమైన పానీయం. భారతీయ వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఇతర ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అల్లం టీ:

ఈ హెర్బల్ టీలో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది అల్లం(Ginger). ఇది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. అల్లం రసం తో కూడిన టీ తాగితే కడుపులో వికారం తగ్గించి ఆకలి  పెంచటానికి అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. అంతే కాదు జలుబు(Cold) తో పోరాడేందుకు చక్కని ఔషధగుణాలు ఇందులో వున్నాయి.

పసుపు టీ                

ప్రతి ఇంట్లో వుండే మరో ముఖ్యమైన ఔషధం పసుపు(Turmeric). పసుపు శరీరానికి అంటి బయోటిక్(Anti Biotic) గా పనిచేస్తుంది. పసుపు కొమ్ముల నుంచి తయారు చేసిన టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాదు శరీరంలో ఏర్పడే వాపులను, మంటను తగ్గిస్తుంది.

పుదీనా టీ

హెర్బల్ టీలో ప్రముఖంగా చెప్పుకోదగినది పుదీనా టీ(Pudhina Tea). జలుబు, శ్వాసనాళ్ళల్లో ఇబ్బందులు ఎదురుక్కునే  వారు  ఈ టీ తాగడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి, కడుపులో గ్యాస్, సమస్యలకు చెక్(Check) పెట్టవచ్చు.

ఇవే కాకుండా పూల(Flowers)తోను కొన్ని రకాల హెర్బల్ టీ(Herbal Tea)లను తయారు చేస్తారు.  వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది.

మందార పూల టీ                      

మందార పూల(Hibiscus Tea) లో మంచి ఔషధగుణాలు వున్నాయి. వీటిలో అంటి ఆక్సిడెంట్ లు ఎక్కువ గా వున్నాయి. జీవక్రియలు సరిగా

జరగడానికి ఉపయోగపడతాయి. అలాగే మందార టీ తాగడం వల్ల చేదు కొలెస్ట్రాల్(Bad Cholesterol) తగ్గిపోతుంది.

లావెండర్ పూల టీ 

లావెండర్ పూల(Lavender Tea) నుంచి తయారు చేసే టీ మానశిక ప్రశాంతతను చేకూరుస్తుంది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరానికి కొత్త ఉత్సహాన్ని ఇస్తుంది.

చమోమైల్ టీ

చమోమైల్ టీ(Chamomile Tea) తాగడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. మంచి నిద్రను కలిగిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ(Immunity)ను బూస్ట్ చేస్తుంది. ఇక జలుబు, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలను తగ్గిస్తుంది.  చమోమైల్ టీని తీసుకోవడం ద్వారా నెలసరి నొప్పి(Menstrual pain)ని తగ్గిస్తుంది.

రోజ్ గ్రీన్ టీ

రోజ్ గ్రీన్(Rose Green Tea) టీ  వెయిట్ లాస్(Weight Loss) కు బాగా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ను మెరుగు  చేస్తుంది. వెయిట్ లాస్ కు హెల్తీ డైజెషన్ సిస్టమ్ కు డైరెక్ట్ సంబంధముంది. రోజుకు ఒక కప్పుడు రోజ్ గ్రీన్ టీ తో హెల్తీ వేలో వెయిట్ లాస్ సాధ్యమవుతుంది.

జాస్మిన్ పెరల్స్ గ్రీన్ టీ

జాస్మిన్ పెరల్స్ గ్రీన్ టీతో హార్ట్ డిసీజ్, డయాబెటిస్ మరియు క్యాన్సర్ వంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.ఇస్తుంది.

సాంప్రదాయ టీ(Traditional Tea)  లేదా చాయ్(Chai) తాగడంకంటే హెర్బల్ టీ(Herbal Tea) తాగడం వల్ల శరీరానికి అంటి ఆక్సిడెంట్లు(Anti Oxidants) అందుతుతాయి. శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్(Pre Radicals) ను బయటకు పంపించివేస్తాయి. అలాగే హెర్బల్ టీ వల్ల నూతనోత్తేజం వస్తుంది.

మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తుంది. కాబట్టి సాంప్రదాయ టీ కంటే హెర్బల్ టీ ని ఎంచుకోవటం చురుకైన ఆరోగ్యానికి  మంచి బాటలు వేసుకోవడమే అన్న మాట. అంతే కాకూండా పూలతో తయారు చేసే టీలతో  రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు.