విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) , మెగా ప్రిన్స్(Mega Prince) వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఫన్ ఫ్రాంచైజీ(Fun Franchise) ఎఫ్ 3 చిత్రం నేడు ప్రేక్షకుల(Audience) ముందుకు వచ్చేస్తోంది. ఎఫ్2 చిత్రం(F2 Movie) ఎంతటి సక్సెస్(Success) ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న ఎఫ్3 పై భారీ అంచనాలు(Huge Expectations) నెలకొని ఉన్నాయి.  వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ పంచ్(Comedy Punches) లు అదరగొడితే, ఇక మెహ్రీన్, తమన్నా, సోనాల్ చౌహన్ లాంటి గ్లామర్ ముద్దుగుమ్మల అందాలు మరో వైపు అలరించేసారు.

సూపర్ పాజిటివ్ బజ్(Super Positive Buzz) తో ఎఫ్3 థియేటర్స్ లో సందడి మొదలైంది.

ఎఫ్3 చిత్రానికి ఉన్న క్రేజ్ తో బిజినెస్(Business) కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అయితే తాజా సమాచారం మేరకు ఎఫ్3 ఓటిటి డీల్(OTT Deal) ఓ కొలిక్కి వాచినట్టు తెలుస్తోంది. ఎఫ్3 చిత్ర ఓటిటి రైట్స్(OTT Rights) ని ఫ్యాన్సీ సర్ప్రైజ్ కి సోనీ లివ్ సంస్థ(Sony Liv Company) సొంతం చేసుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓటిటి రైట్స్ కోసం అమెజాన్ సంస్థ(Amazon Rights) కూడా పోటీ పడ్డప్పటికీ సోనీ లివ్ దక్కించుకున్నట్లు టాక్.

సోనీ లివ్ సంస్థ ఎఫ్3 చిత్ర ఓటిటి రైట్స్ కోసం దాదాపు 18 కోట్లు ఆఫర్(18 Crores) చేసినట్లు సమాచారం. ఇది దిమ్మతిరిగే ధరే అని చెప్పాలి. ఎఫ్2 చిత్రంలో కామెడీని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఫ్యామిలీ, మాస్, యూత్ ఇలా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఆ క్రేజ్ తోనే ఎఫ్3 మూవీపై సోనీ లివ్ భారీ ధర(Huge Price) వెచ్చించింది. పక్కాగా ప్లాన్ చేస్తే కామెడీ(Comedy) చిత్రాలకు ఉండే స్థాయి ఇది అని అంటున్నారు.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఓటిటి రైట్స్ 20 నుంచి 30 కోట్ల వరకు పలుకుతుంటాయి. ఆ లెక్కన చూస్తే ఎఫ్3 మూవీ అదిరిపోయే డీల్ అందుకున్నట్లే. కామెడీ చిత్రాలకు రిపీట్ వ్యాల్యూ(Repeat Value) కూడా ఉంటుంది. కాబట్టి  ఎఫ్ 3 కనుక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సోనీ లివ్ సంస్థ లాభపడినట్లే.

ఎఫ్3 చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్(World Wide) గా దాదాపు 60 కోట్ల(60 Crores) ప్రీ రిలీజ్ బిజినెస్(Pre Release Business) చేసింది.

ఎఫ్2 చిత్రం ఫుల్ రన్ లో 80 కోట్ల(80 Crores) వరకు షేర్ రాబట్టిన సంగతి తెలిసిందే.

ఎఫ్ 3 పాజిటివ్ టాక్(Positive Talk) అందుకుంటే తప్పకుండా బయ్యర్లకు(Buyers) లాభాలు అందిస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ మూవీని రూపందించిన సంగతి తెలిసిందే.