బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) ఈ వారం హౌస్ లోచోటు చేసుకున్న పరిణామాలతో హౌస్ మేట్స్(House mates) మధ్య  హీట్ ఆర్గుమెంట్స్ జరిగాయి. మరి సన్నీ ప్రియాల మధ్య గొడవ నిప్పులు రాచేశాయి. ఈ గొడవ తో ప్రియా మీద వున్న ఇంప్రెషన్ కాస్త నెగటివిటీగా మారిపోయింది.

ఇక శనివారం అంటేనే ఎంటర్టైన్మెంట్(Entertainment) మరి నాగ్ సర్ హౌస్ మేట్స్ తో ఎలాంటి ఫన్ చేయించారో. ఎవరెవరిని ఎలిమినేషన్(Elimination) నుంచి సేఫ్ చేసారో? హౌస్ మేట్స్ తోనాగ్ ఎలాంటి డిస్కషన్ పెట్టారో? ఎవరెవరికి క్లాస్ పీకారో? మళ్ళీ దొరికిపోయిన రవి ని ఎలా ఆడేసుకున్నారో?

ఈ వారం వరస్ట్ పెరఫార్మెర్(Worst performer) ఎవరో?ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే 49వ ఎపిసోడ్ పై ఓ లుక్ వేయాల్సిందే.

పుష్ప చిత్రంలోని ‘శ్రీవల్లీ’ పాట తో మోడల్స్‌ తో కలసి స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు నాగ్ సార్. ఆ తరువాత  శుక్రవారం హౌస్ లో జరిగిన   ముచ్చట్లను టీవీ ద్వారా చూపించారు.

సన్నీ బిగ్ బాస్(Big Boss) హౌస్‌కి కెప్టెన్(Captain) కావడంతో హౌస్ మేట్స్(House mates) తో సంతోషాన్ని పంచుకున్నాడు.

తన ఫ్రెండ్ శ్వేతా కోసం కెప్టెన్ అవ్వాలని అనుకున్నా, ఆమెకు డెడికేట్ చేస్తున్న అని చెప్పాడు సన్నీ. ఇక  కెప్టెన్ ఛాన్స్‌ మిస్ చేసుకున్న  కాజల్‌ని రేషన్ మేనేజర్‌గా ప్రకటించారు.

మ్యాట్రిమొనీ వారి పెళ్లి సంబంధాల టాస్క్‌(Task) లో మానస్, ప్రియాంక, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్‌లు పాల్గొన్నారు. తమకి కాబోయే వాళ్లలో ఎలాంటి క్వాలిటీస్(Qualities) ఉండాలో చెప్పాలని అడిగారు.

ముందు గా  మానస్ మాట్లాడుతూ తాను చాలా తక్కువగా మాట్లాడతానని ఎక్కువ మాట్లాడే అమ్మాయి అలాగే రెండు ఫామిలీస్ ని బాగా చూసుకోవాలని చెప్పాడు. అయితే మానస్ మాట్లాడుతున్నంతసేపూ ప్రియాంక తెగ సిగ్గుపడిపోయింది.

తరువాత  ప్రియాంక మాట్లాడుతూ తనకి వచ్చేవాడు తనకంటే హైట్ ఉండాలని  తన దగ్గర బోలెడంత ప్రేమఉంది కాబట్టి అది అతనికి ఇచ్చేస్తా అని చెప్తూ నా ఫ్యామిలీతో పాటు అబ్బాయి ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకుంటా అని చెప్పింది. ఇక మానస్ కావాల్సినది అదే కాబట్టి  తన గురించి చాలా ఉహించుకుంటున్నట్టు వుంది.

మొత్తం మీద హౌస్ మేట్స్(House mates)  ఏకాభిప్రాయంతో బెస్ట్ కపుల్స్‌(Best couples) గా మానస్, ప్రియాంకలను ఎంచుకున్నారు. దీంతో ఈ ఇద్దరు  మెడలో దండాలు వేసుకుని హౌస్ మేట్స్ సమక్షం లో పెళ్లి చేసుకున్నారు.

అనంతరం గువ్వా గోరింక అనే పాటకు స్టెప్స్ వేయించిన బిగ్ బాస్. ఈ టాస్క్ తో ప్రియాంక మానస్ పై  ఎక్కువగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకుంటోంది. ఈ పెళ్లి తంతు తో బిగ్ బాస్ ప్రియాంక ఎమోషన్స్ తో ఆడుకున్నారేమో అనిపిస్తుంది.

కానీ మానస్ ఏమో ప్రియాంక తో ఎప్పటిలానే వున్నాడు.  కానీ పింకీ కి  మానస్ మీద వున్న ఫీలింగ్స్ ఎలాంటి పరిణామాలకు దారి తిసుతుందో.

ఈ పెళ్లి తంతు పై చర్చ పెట్టుకుంటారు ప్రియా, రవి. పింకీ మానస్ విషయంలో క్లారిటీతోనే ఉంది కదా అని రవి అడగ్గా పిచ్చ క్లారిటీతో ఉందని ప్రియ అంటుంది. కానీ మధ్యలో ఆనీ మాస్టర్ కల్పించుకుని పింకీ ఓవర్ గా ఆశలు పెట్టుకుంటోందని ఆమెను చూస్తుంటే భయంగా ఉందని, తన గురించి తాను ఆడకుండా మానస్ కోసమే ఆడుతుందని చెప్పింది.

దీంతో రవి మాట్లాడుతూ నాకు మానస్ వాళ్ల మదర్ కూడా తెలుసు, అందుకే మానస్ దగ్గరకు వెళ్లి అడిగా టాస్క్‌(Task) లో ఇలా చేస్తున్నాం పర్లేదా? అని, తను పర్లేదు అని చెప్పాడు అందుకే కపుల్‌గా వాళ్లని సెలెక్ట్ చేశాం అని చెప్పాడు. అయితే రవి-ప్రియల మధ్య జరిగిన చర్చని అంత ప్రియాంకతో చెప్పేసింది ప్రియ.

మీ మదర్ రవికి తెలుసంట కదా. ఇలాంటివి ఆమెకు నచ్చవని ప్రియతో చెప్పడంట అని ప్రియాంక మానస్‌తో చెప్పడంతో మా మదర్ రవికి ఎలా తెలుసు, ఓ ఈవెంట్‌లో కలిశారు అంతే  ఇవన్నీ పట్టించుకోకు అని చెప్పాడు మానస్.

ఇక ఈ వారం వరస్ట్ పెర్ఫామర్(Worst Performer) ఎవరో అని ఒక్కో హౌస్ మేట్స్(House mates) ని అడిగారు  నాగార్జున. అయితే ఎక్కువ మంది విశ్వ పేరుని చెప్పడంతో అతన్ని సోమవారం నాడు జైలుకి వెళ్లాల్సిందిగా ఆదేశించారు నాగార్జున. అయితే యాంకర్ రవిని  టార్గెట్ చేసినారు నాగ్ .

రవి ఏది చెప్పినా దానికి కౌంటర్ ఇస్తూ నువ్వు డిస్కషన్ ని ఎంత ఎక్స్టెండెడ్ చేస్తే అంత ఎక్కువ బుక్ అయిపోతావు  అని సెట్టైర్ వేశారు.

టాస్క్(Task) లో ఆట బాగా ఆడుతున్నావు అని, స్ట్రాటజీ బాగా ప్లే చేస్తున్నావు. సిరి  దగ్గర స్టిక్కర్స్ ఎందుకు దొంగిలించావు  అని అడిగారు. అయితే స్టిక్కర్స్ దొంగిలించి అమ్మతోడు అని రవి అనడంతో ఆ పాయింట్ తీసుకుని నాగార్జున ఏకిపారేశారు. ఏదో ఫ్లోలో వచ్చేసిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు రవి.

చెంప పగలగొడతాను అని ఎన్నిసార్లు అంటావని ప్రియను నిలదీశాడు నాగ్‌. దీనికి వివరణ ఇచ్చేందుకు ప్రియ ప్రయత్నిస్తూ ‘బుట్టలో ఎగ్స్‌ తీయబోతుంటే సన్నీ నన్ను నెట్టేయగా ముందుకు పడిపోయాను. అతడు నానా మాటలు అనడంతో నాతో ఫిజికల్‌(Physical) అయితే మాత్రం చెంప పగలగొడతాను అని తిట్టాను’ అని ఒప్పుకుంది.

మరీ అన్నిసార్లు తిట్టకని కూల్ గానే స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నాగ్‌.

తర్వాత యానీ మాస్టర్‌- జెస్సీని, శ్రీరామ్‌- మానస్‌ను, మానస్‌- షణ్ముఖ్‌ను, కాజల్‌- ప్రియను, వరస్ట్‌ పర్ఫామర్‌(Worst Performer)గా చెప్పుకొచ్చారు.

ఈవారం నామినేషన్స్‌(Nominations) లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్(Contestants) ఉండగా వారిలో ఇద్దరు  శ్రీరామ్, కాజల్‌లను సేఫ్ చేశారు.

మిగిలిన ఆరుగురు రవి, సిరి, జెస్సి, ఆనీ, లోబో, ప్రియలు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్(Eliminate) అవుతారన్నది సండే ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

మొత్తంగా శనివారం నాటి ఎపిసోడ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్(Entertainment) లేకుండానే ముగిసిపోయింది.

అయితే హౌస్ అంత క్లీన్ గా లేకపోవడం తో కొన్ని వీడియోస్(Videos) చూపించి క్లాస్ పీకిన నాగ్. ఈ వారం కెప్టెన్ అయినా సన్నీ ని కి హౌస్ బాధ్యతలను అప్పజెప్పిన నాగ్…..