ఘుమఘుమలాడే కొత్తిమీర …

సాధారణం గా వివిధ రకాల వంటకాలలో రుచి కోసం, వాసనా కోసం, లేదా గార్నిషింగ్ (Garnishing) గా కొత్తమీరను ఉపయోగిస్తుంటాము.

garnishing coriander

ఈ మధ్య కలం లో మన ఇంటి పెరట్లో చాలా సులభం గా కొత్తిమీరను పెంచుకుంటున్నారు. కేవలం రుచి (Smell) కోసమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కొత్తిమీర యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండడం వలన హెల్త్ కి చాలా మంచిది. కొత్తిమీర లో మినరల్స్, విటమిన్స్ (Vitamins) ఎక్కువ గా ఉంటాయి.

శరీరం లోని కొవ్వు పదార్దాలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు చెడ్డ కొవ్వు ని తగ్గించి మంచి కొవ్వు ని పెంచుతుంది.ఎముకులు దృఢం గా వుండడానికి కావాల్సిన విటమిన్ కె (Vitamin K)అధికం గా ఉంటుంది. కాపర్, జింక్, పొటాషియం, ఐరన్, సోడియం ఆక్సాలిక్ యాసిడ్స్, వంటి మినరల్స్ కూడా ఎక్కువ గానే ఉంటుంది.

తినే ఆహారాన్ని కొత్తిమీర రుచి గానే కాకుండా జీర్ణ క్రియ స్థాయి ని కూడా పెంచుతుంది.అంతే కాకుండా వాంతులు అజీర్ణం వంటివి నివారిస్తుంది.కొత్తమీర లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండడం వలన కంటి కి సంబంధించిన రోగాలను నివారిస్తుంది.

ఆహారంలో కొత్తిమీర ను వాడడం వలన కిడ్నీ లో వచ్చే రాళ్లను (Kidney stones) నివారించవచ్చును. అలాగే పేదలు, పిల్లలలో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్ ని అరికట్టవచ్చు.

healthy coriander

కొత్తిమీర బ్లడ్ ప్యూరీఫైర్ గా కూడా బాగా పని చేస్తుంది. కొత్తిమీర తో జుట్టు సమస్యలను కంట్రోల్ చేస్తుంది. చర్మాన్ని కాపాడడానికి వాడే రసాయన మందులో కొత్తిమీర ని వాడుతారు.

స్కిన్ గ్లో  (Skin glow)పెంచడమే కాకుండా , ముఖం పైన వుండే పొడి చర్మం, పిగ్మెంటేషన్, మొటిమలను, నల్లటి చర్మం వంటివి పోగొట్టడంలో కొత్తిమీర ప్రధాన పాత్రను పోషిస్తుంది.

స్కిన్ ప్రొబ్లెమ్స్ (skin problems) ని కొత్తిమీర ఆకులతో ఎలా నివారించుకోవచో తెలుసుకుందాం.

* కొత్తిమీర ఆకులను క్లీన్ చేసి మెత్తని పేస్టులా మిక్స్ పట్టుకోవాలి. ఒక టీస్ స్పూన్ అలోవెరా జెల్ (aloevera gel) ని కొత్తిమీర పేస్ట్ తో కలిపాలి. ఆలా కలిపినా మిశ్రమాన్ని ముఖం, మీద రాసుకుని 15 నిముషాలు ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లటి నీటి తో ముఖం కడిగేయాలి. ఇలా తరుచు చేస్తుంటే ముఖం పై వచ్చే ముడతలను తగించివచ్చు.

coriander paste

* కొత్తిమీర ఆకులు స్కిన్ గ్లో ని పెంచడానికి బాగా పనిచేస్తాయి. కొత్తిమీర ఆకులను మెత్తగా అందులో రెండు చెంచాల పచ్చి పాలు, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖం, మెడపై రాసుకోవాలి. ౨౦ నిమిషాల తరువాత వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా వాడుతుంటే స్కిన్ గ్లో వస్తుంది.

* కొత్తిమీర ఆకులను మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక చెంచా నిమ్మరసం (lemon juice)కలపండి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.ఆలా తయారు చేసిన పేస్ట్ ని ముఖం, మెడపై అప్లై చేసుకుని ఇరవై ఐదు నిమిషాల పాటు ఉంచి నీటితో శుభ్రంచేసుకోండి. ఇది మొటిమలు, మచ్చల ను తొలగిస్తుంది. చర్మం సాఫ్ట్ గామారుతుంది. అలాగే మృత కణాలను కూడా తొలగిపోతాయి.

*తేనే (Honey)తో కలిపినా కొత్తిమీర జ్యూస్ తాగడం వలన చర్మం మెరుస్తుంటుంది. కొత్తిమీర జ్యూస్ తో మన శరీరం లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ని కూడా పెంచుకోవచ్చును.

కొత్తిమీర ను ఉపయోగించి స్కిన్ ప్రోల్మ్స్ (skin problems) ఎలా నివారించుకోవచ్చునో తెలుసుకున్నాము కదా మరి ఆలస్యం ఎందుకు మనకి ఎంతో సులువుగా లభించే కొత్తిమీరతో చర్మాన్ని మరింత కాంతివంతంగా చేసుకుని అందరి తో వావ్ అనిపించేసుకోండి మరి …